టూవీలర్‌ కొనుగోళ్లపై తక్కువ వడ్డీరేట్లను అందిస్తున్న బ్యాంకులు ఇవే..!

14 Aug, 2021 18:49 IST|Sakshi

మనలో చాలా మందికి సొంత బైక్‌ను కొనాలనే ఆశ అందరికీ ఉంటుంది. డబ్బులు ఉన్నవారు వెంటనే ఆయా బైక్‌ కొనుగోలు చేస్తారు. డబ్బులు పూర్తిగా వెచ్చించి బైక్‌ను కొనుగోలు చేసే వీలు లేని వారి కోసం పలు బ్యాంకులు నిర్ణీత వడ్డీరేటుతో అప్పును ఇస్తాయి. మీ సిబిల్‌ స్కోర్‌ 750కు మించి ఉంటే బ్యాంకులు మీకు అప్పును అందిస్తాయి. సులభ వాయిదాల చొప్పున అప్పును చెల్లిసే​ మీరు కొనుగోలు చేసిన బైక్‌ మీ సొంతం అవుతుంది.

పలు బ్యాంకులు టూవీలర్‌ కొనుగోళ్లపై  గరిష్టంగా రూ. 10 లక్షల వరకు అప్పును  ఖాతాదారులకు అందిస్తున్నాయి. ఫలానా బ్యాంకుల నుంచి అప్పులను తీసుకోవడంలో వడ్డీరేట్లు ఎలా ఉంటాయో అనే సందేహం చాలా మందికి ఎదురై ఉంటుంది. టూవీలర్‌ కొనుగోళ్లపై అతి తక్కువ వడ్డీరేట్లను అందిస్తోన్న బ్యాంకుల వివరాలను మీ ముందుకు తెచ్చాం. 

రుణాలను పొందడానికి కావాల్సిన అర్హతలు:

  • రుణగ్రహీతలు 21 నుంచి 58 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
  • రుణగ్రహీత నెలకు కనీసం 10,000 రూపాయల ఆదాయం కలిగి ఉండాలి.  
  • గత 3 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌ను రుణగ్రహీతలు తప్పనిసరిగా ఉంచుకోవాలి.
టూవీలర్‌పై తక్కు వ వడ్డీరేట్లను అందిస్తున్న బ్యాంకులు
క్రమ సంఖ్య. బ్యాంకులు అందిస్తోన్న వడ్డీరేట్లు లోన్‌ అమౌంట్‌
1. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25% నుంచి 7.70%  రూ. 10 లక్షలు (గరిష్టంగా)
2. బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35% నుంచి 8.55% రూ. 50 లక్షలు (గరిష్టంగా)
3. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.70% నుంచి 10.05% రూ. 10 లక్షలు (గరిష్టంగా)
4. జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ 8.70% నుంచి మొదలు రూ 2.5 లక్షలు (గరిష్టంగా)
5 పంజాబ్ & సింధ్ బ్యాంక్ 9.00% నుంచి మొదలు రూ. 10 లక్షలు (గరిష్టంగా)
6. కెనరా బ్యాంక్ 9.00% నుంచి మొదలు రూ. 10 లక్షలు (గరిష్టంగా)
7. ఐసీఐసీఐ బ్యాంక్ 9.50% నుంచి 26.00% రూ. 3 లక్షలు (గరిష్టంగా)
8. ఐడీబీఐ బ్యాంక్ 9.80% నుంచి 9.90% రూ. 1.20 లక్షలు నుంచి మొదలు
9. యూనియన్ బ్యాంక్ 9.90% నుంచి 10.00% రూ. 10 లక్షలు (గరిష్టంగా)
10.  ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 9.99 % అంతకంటే ఎక్కువ రూ. 3 లక్షల కంటే ఎక్కువ

గమనిక: పై వడ్డీరేట్లు ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లనుంచి గ్రహించినవి.

మరిన్ని వార్తలు