Top 10 Most Visited Websites In The World 2021: ఈ ఏడాదిలో ఎగబడి సందర్శించిన వెబ్‌సైట్‌ ఇదే..! గూగుల్‌ మాత్రం కాదండోయ్‌..!

25 Dec, 2021 20:40 IST|Sakshi

Top 10 Most Visited Websites In The World 2021: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సందర్శించిన వెబ్‌సైట్‌ ఏదంటే ఠక్కున ఏది చెప్తాం..సింపుల్‌ గూగుల్‌ అనేస్తాం.  ఎందుకంటే మనకు ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసం సింపుల్‌గా ఒకే గూగుల్‌...! అంటూ  గూగుల్‌.కామ్‌ను తలుపుతడతాం. ఇలా మనలో అందరూ చేసే వాళ్లమే. అయితే 2021 ఏడాదిగాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సందర్శించిన వెబ్‌సైట్‌ మాత్రం గూగుల్‌ కాదండోయ్‌..అవును మీరు విన్నది నిజమే. 2021లో అత్యధికంగా సందర్శించిన వెబ్‌సైట్ల మొదటి స్ధానంలో టిక్‌టాక్‌ నిలిచింది. తరువాతి స్థానంలో గూగుల్‌ నిలవడం గమనర్హం. 

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించిన టాప్‌ 10 వెబ్‌సైట్‌ లిస్ట్‌ మీకోసం...!

1. టిక్‌టాక్‌. కామ్‌
ప్రముఖ షార్ట్‌ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌ ప్రపంచంలోనే ఎక్కువ మంది సందర్శించిన వెబ్‌సైట్‌గా నిలిచింది. భారత్‌లో నిషేధం ఉన్నప్పటికీ టిక్‌టాక్‌ అదరగొట్టింది. సుమారు 1 బిలియన్ వరకు క్రియాశీల వినియోగదారులను  టిక్‌టాక్‌ కలిగి ఉంది. బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక మొత్తంలో ట్రాఫిక్‌ను సొంతం చేసుకున్నది

2.గూగుల్‌.కామ్‌
మనకు ఏదైనా చిన్న సమస్య వచ్చిదంటే చాలు వెంటనే చేసేది గూగుల్‌ సెర్చ్‌. కాగా 2021లో రెండవ స్థానంలో ఉండడం. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే రెండవ వెబ్‌సైట్‌గా తన స్థానాన్ని దక్కించుకున్నది.

3. ఫేస్‌బుక్‌.కామ్‌
టిక్‌టాక్‌, గూగుల్‌ తరువాత మూడోస్థానంలో ఫేస్‌బుక్‌ నిలిచింది.  2021లో ఫేస్‌బుక్‌ తన పేరును మెటాగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫేస్‌బుక్‌కు అంతగా కలిసి రాలేదు. వీపరితమైన ఆరోపణలు మార్క్‌ జుకమ్‌బర్గ్‌ వెన్నులో వణుకు తెచ్చేలా చేశాయి. ఫేస్‌బుక్ 0.8 బిలియన్ క్రియాశీల యూజర్లు ఉన్నారు. 

4. మైక్రోసాఫ్ట్‌
మైక్రోసాఫ్ట్‌ నాలుగో స్ధానంలో నిలిచింది.  మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన వన్‌డ్రైవ్‌, ఎక్స్‌బాక్స్‌లన భారీగా సందర్శించారు. 

5. యాపిల్‌ 
యాపిల్ సంస్థ 5వ స్థానంలో కొనసాగడం అనేది కూడా కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఐక్లౌడ్‌, యాప్‌స్టోర్‌​ వంటి ఇతర సేవలను సందర్శించే వ్యక్తులు అధికంగా ఉన్నప్పటికీ ఈ స్థానాన్ని కలిగి ఉంది. 

6. అమెజాన్‌
కరోనా సమయంలో చాలా మంది వ్యక్తులు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ ఎక్కువగా సందర్శించారు. ఆన్‌లైన్ షాపింగ్ మార్కెట్‌ గణనీయంగా పెరిగింది. 2021లో అత్యధికంగా సందర్శించిన వెబ్‌సైట్ ల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. 

7. నెట్‌ఫ్లిక్స్‌
కరోనా-19 రాక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కాసుల వర్షాని కురిపించింది. థియేటర్లు మూతపడటంతో సినీ లవర్స్‌ ఓటీటీలకు ఎగబడ్డారు. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఏడవ స్థానంలో నిలిచింది. 

8. యూట్యూబ్‌
ప్రముఖ ఓటీటీ సంస్థలు, అమెజాన్‌, డిస్నీ హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌ రాకతో యూట్యూబ్‌కు భారీ పోటీనిచ్చాయి. 2021లో అధిక మంది సందర్శించిన  ప్లాట్‌ఫారమ్స్‌లో యూట్యూబ్  8వ స్థానంలో ఉంది.

9. ట్విటర్‌
2021లో ఫేస్‌బుక్‌ ఒక్కసారిగా డౌన్‌ అవ్వడంతో ఠక్కున యూజర్లు ట్విటర్‌ తలుపులను తట్టారు. ఈ ఏడాదిలో అత్యధిక సందర్శించిన వెబ్‌సైట్‌లో ట్విటర్‌ 9 స్ధానంలో నిలిచింది. 

10. వాట్సాప్‌
చివరగా పదో స్థానంలో  మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌ నిలిచింది. టాప్ 10 జాబితాలో మెటా యాజమాన్యంలోని రెండు యాప్ లు ఉండడం విశేషం.

చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్‌ హెచ్చరిక..!

మరిన్ని వార్తలు