భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే!

2 Sep, 2022 17:16 IST|Sakshi

ఆటోమొబైల్‌ రంగంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సత్తా చాటుతున్నాయి. అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. ఈవీ వెహికల్స్‌లో లోపాలు తలెత్తినా తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల్ని నివారించ వచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం ఇప్పటి వరకు దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్‌ స్కూటర్ల గురించి తెలుసుకుందాం. 

ఓలా ఎస్‌1
కొనుగోలు దారుల్ని ఆకట్టుకునే ఈవీ వెహికల్స్‌ స్కూటర్ల జాబితాలో ఓలా నిలిచింది. ఓలా ఎస్‌1 121కేఎం స్పీడ్‌, ఓలా ఎస్‌ 1 ప్రో 181కేంఎ స్పీడ్‌ను కలిగి ఉంది. ఓలా ఎస్‌1 టాప్‌ స్పీడ్‌ గంటలకు 115కేఎంపీఎహెచ్‌ వేగంతో వెళ్లొచ్చు. ఈ వెహికల్‌ 0కిలో మీటర్ల నుండి 40కిలోమీటర్ల చేరుకోవడానికి 3 సెకన్ల సమయం పడుతుందని ఆ సంస్థ ప‍్రతినిధులు తెలిపారు. ఇ‍క ఈ వెహికల్స్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కంట్రోల్ ఆప్షన్‌లు, క్రూయిజ్ మోడ్ ఫీచర్ల ఉన్నాయి. 10 వేరియంట్‌ కలర్స్‌లో  లభ్యం అవుతుంది. 

అథర్ ఎనర్జీ 450ఎక్స్‌ జనరేషన్‌ 3
పవర్‌ ఫుల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ జాబితాలో అథర్‌ ఎనర్జీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు పేరు గడించాయి. వీటి రైడింగ్‌ రేంజ్‌ 146 కిలోమీటర్లకు 8.7బీపీహెచ్‌ పవర్‌ను ప్రొడ్యూజ్‌ చేస్తుంది. అథర్‌ ఎనర్జీ డిజైన్‌ చేసిన ఈ స్కూటర్‌లో డిజిట్‌ డ్యాష్‌ బోర్డ్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటర్‌, మ్యాప్‌, కాలింగ్‌ డీటెయిల్స్‌తో పాటు ఇతర సదుపాయాలుండగా.. ఈ స్కూటర్‌ మోస్ట్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్ల జాబితాలో నిలిచింది. 

ఓకినావా ఒకి 90
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒకినావాకు చెందిన ‘ఓకినావా ఒకి 90’ కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో సిగ్నల్స్‌, వెహికల్స్‌ ఓవర్‌ టేక్‌ చేసే సమయంలో వాహనదారుల్ని సురక్షితంగా ఉంచేలా  డే టైం రన్నింగ్‌ లైట్స్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 140కేఎం రైడింగ్‌ రేంజ్‌, టాప్‌ స్పీడ్‌ 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 16 అంగుళాల వీల్‌తో ..లార్జెస్ట్‌ వీల్‌ సెగ్మెంట్‌లో ఈ వెహికిల్‌ నిలిచింది. దీంతో పాటు బూట్‌ స్పేస్‌ 40 లీటర్ల సౌకర్యం ఉంది. 

హీరో ఎలక్ట్రిక్‌ ఎడ్డీ
ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో  హీరో ఎలక్ట్రిక్‌ డిఫరెంట్‌ డిజైన్‌లతో వెహికల్స్‌ను విడుదల చేస్తుంది. వాటిలో హీరో ఎలక్ట్రిక్‌ ఎడ్డీ ప్రత్యేకం. ఈ వెహికల్స్‌లో మ్యాక్సిమం రైడింగ్‌ రేంజ్‌ 85కేఎం ఉండగా టాప్‌ స్పీడ్‌ 25కేఎంపీహెచ్‌గా నిలిచింది. ఈ స్కూటీలో యాక్సిలేటర్‌తో పనిలేకుండా స్థిరమైన వేగంతో నడింపేందుకు ఉపయోగపడే  క్రూయిస్ కంట్రోల్, డిజిటల్‌ ఇనస్ట్రుమెంట్‌ క్లస్‌, బ్లూటూత్‌ ట్రాకింగ్‌, ఫాలోమీ హీడ్‌ ల్యాంప్‌, ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.72వేలుగా ఉంది. 

హీరో ఎలక్ట్రిక్‌ ఆప్టిమా సీఎక్స్‌ 
హీరో ఎలక్ట్రిక్‌ ఆప్టిమా సీఎక్స్‌ సైతం హీరో ఎలక్ట్రిక్‌ సంస్థ వెహికల్స్‌లో మోస్ట్‌ పాపులర్‌ బ్రాండ్‌గా పేరు సంపాదించింది. ఈ స్కూటర్‌ను సింగిల్‌ ఛార్జ్‌తో 140కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు. డిటాచ్‌బుల్‌ ఎలక్ట్రిక్‌ బ్యాటరీ. ఈ సౌకర్యంతో మీ పనిపూర్తయిన వెంటనే వెహికల్‌ నుంచి ఆ బ్యాటరీని వేరే చేయొచ్చు. టాప్‌ స్పీడ్‌ 45కేఎంపీహెచ్‌ ఉన్న ఈ స్కూటర్‌లో డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌,యూఎస్‌బీ పోర్ట్‌ సౌకర్యం ఉంది.

చదవండి👉 రతన్‌ టాటా-నీరా రాడియా సంభాషణల టేపు లీక్‌! ఎనిమిదేళ్ల తర్వాత..

మరిన్ని వార్తలు