ఇన్వెస్టర్ల జేబులు గుల్ల.. పేటీఎం ఒక్కటే కాదు.. ఇవి కూడా

20 Nov, 2021 15:59 IST|Sakshi

ఎన్నో అంచనాల నడుమ ఇన్షియల్‌ పబ్లిక​ ఇష్యూకి వచ్చిన పేటీఎం షేర్లు ఇన్వస్టర్లకు షాక్‌ ఇచ్చాయి. దేశంలోనే అతి పెద్ద ఐపీవోగా రికార్డు స్థాయిలో రూ.18,300 కోట్ల నిధులు సమీకరణ లక్ష్యంగా అడుగులు పడగా లిస్టింగ్‌ అయిన తొలిరోజే షేర్ల ధర భారీగా పడిపోవడంతో ఒక్క రోజులోనే 38 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.

అంచనాలు తారుమారు
పేటీఎంకి ముందు ఐపీవోకి పలు కంపెనీలు వచ్చాయి. వీటిలో జోమాటో, నైకా ఐపీవోలు సంచనలం సృష్టించాయి. జోమాటో లిస్టింగ్‌లోనూ అదరగొట్టినా ఆ తర్వాత కొంత వెనుకడుగు వేసింది. ఇక నైకా షేర్లు ఇంకా జోరుమీదే ఉన్నాయి. ఇదే పరంపరలో వచ్చిన పేటీఎం మాత్రం బొక్కబోర్ల పడింది. అయితే లాంగ్‌రన్‌లో పేటీఎం షేర్లు లాభాలు అందిస్తాయనే వారు ఉన్నారు. పేటీఎం తరహాలో గతంలో లిస్టింగ్‌లో అనేక కంపెనీలు ఢమాల్‌ అన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఐపీవోల వివరాలు..
-  దేశవ్యాప్తంగా అనేక స్టోర్లను కలిగి నగర వాసులందరదికీ సుపరిచితమైన కాఫీ డే 2015 అక్టోబరు 14న ఐపీవో ఇష్యూ చేసింది. 316 నుంచి 328 ప్రైస్‌బ్యాండ్‌తో 45 లాట్లలో లిస్టింగ్‌కి వచ్చింది. తొలిరోజు కంపెనీ షేర్ల ధర 17.60 శాతం క్షీణించింది.
- అనిల్‌ అంబానికి చెందిన రిలయన్స్‌ పవర్‌ 2008 జనవరి 15న ఐపీవోకి వచ్చింది. ప్రైస్‌బ్యాండ్‌ ధర రూ.405 నుంచి 450గా నిర్ణయించారు. అయితే లిస్టింగ్‌ అయిన తొలిరోజే ఈ కంపెనీ షేర్లు 17.20 శాతం క్షీణించాయి.
- ఇదే తరహాలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ షేర్లు 14.4 శాతం, కెయిర్న్‌ 14.10 శాతం, యూటీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ 14 శాతం, కళ్యాణ్‌ జ్యూయలర్లర్స్‌ 13.4 శాతం, భారతి ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ 13.1 శాతం క్షీణించి  ఐపీవోలో షేర్లు అలాట్‌ కాబడిన ఇన్వెస్టర్లకు కన్నీళ్లను మిగిల్చాయి.
పరిశీలించాకే
స్టాక్‌ మార్కెట్‌లో రంగంలోకి దిగేముందు పూర్తి స్థాయి పరిశీలన అవసరమని నిపుణులు చెబుతుంటారు. ప్రచార ఆర్భాటాలను నమ్మడం కాకుండా కంపెనీ పనితీరు, భవిష్యత్తు, మార్కెట్‌లో ట్రెండ్‌ను బట్టి ఇన్వెస్ట్‌ చేయాలని సూచిస్తుంటారు. 
 

మరిన్ని వార్తలు