కంటెంట్ క్రియేటర్ల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే! ధరలు ఎలా ఉన్నాయంటే?

20 Feb, 2024 19:40 IST|Sakshi

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది సొంతంగా ఎదగాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొందరు కంటెంట్ క్రియేట్ చేసుకోవడం లేదా యూట్యూబ్ క్రియేట్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. అలాంటి వారి అవసరాలకు, ప్రత్యేకించి 'కంటెంట్ క్రియేటర్ల'కు ఉపయోగపడే HP ల్యాప్‌టాప్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 15
హెచ్‌పీ కంపెనీ కంటెంట్ క్రియేటర్ల కోసం రూపొందించిన ల్యాప్‌టాప్‌లలో ఒకటి 'ఎన్వీ ఎక్స్360 15'. ఇది 15.6 ఇంచెస్ ఓఎల్ఈడీ టచ్ డిస్‌ప్లే కలిగి వారి వినియోగానికి తగిన విధంగా మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే స్క్రీన్‌ను 360 డిగ్రీలు తిప్పవచ్చు. ఇది NVIDIA GeForce RTX 3050 లేదా AMD Radeon గ్రాఫిక్స్‌తో సరికొత్త 13వ జెన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌లు లేదా AMD రైజెన్ 5 పొందుతుంది. ఈ ల్యాప్‌టాప్ HP ఆన్‌లైన్ స్టోర్లలో, ఈకామర్స్ సైట్‌లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 78999.

హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 14
హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 14 కూడా అద్భుతమైన పనితీరుని అందించే ఉత్తమమైన ల్యాప్‌టాప్‌. ఇది కూడా OLED డిస్‌ప్లేను పొందుతుంది. దీని ధర రూ. 169999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ల్యాప్‌టాప్‌ HP ఆన్‌లైన్ స్టోర్లలో మాత్రమే కాకుండా, ఈకామర్స్ సైట్‌లలోనూ లభిస్తుంది. పర్ఫామెన్స్ మాత్రమే కాకుండా.. న్యూరల్ ప్రాసెసింగ్ కూడా కలిగి ఉంటుంది. వీడియో ఎడిటింగ్ వంటి వాటికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 16
రూ. 179999 ప్రారంభ ధర వద్ద లభించే ఈ హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 16 ల్యాప్‌టాప్‌ HP ఆన్‌లైన్ స్టోర్లలో, ఈకామర్స్ సైట్‌లలో లభిస్తుంది. మంచి డిజైన్ కలిగిన ఈ ల్యాప్‌టాప్‌ 16 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి హై-రిజల్యూషన్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి వాటికి ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: మెదడులో చిప్ పనిచేస్తోంది.. నిజమవుతున్న మస్క్ కల!

హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 16
మంది డిజైన్, కంటెంట్ క్రియేటర్లకు అవసరమైన ఫీచర్స్ కలిగిన ఈ హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 16 ల్యాప్‌టాప్‌ 2560 x 1600 రిజల్యూషన్, 400 నిట్‌ల బ్రైట్‌నెస్‌ని అందించే 16 ఇంచెస్ డిస్‌ప్లే ప్యానెల్ పొందుతుంది. ఇది ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, 16.0 GB ర్యామ్ వంటి వాటిని పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 124999. ఇది కూడా HP ఆన్‌లైన్ స్టోర్లలో, ఈకామర్స్ సైట్‌లలో లభిస్తుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు