ఐటీ సంస్థల్లో, మహిళలకు బంపర్‌ ఆఫర్‌

5 Aug, 2021 14:24 IST|Sakshi

ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీల్లో కొలువుల జాతర మొదలైంది. టాటా కన‍్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో కంపెనీల్లో సుమారు 60వేల ఉద్యోగాలకు రిక్రూట్‌ మెంట్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 60వేల ఉద్యోగాల నియామకం అమ్మాయిలకు మాత్రమే వర‍్తిస్తుందని ఆయా దిగ్గజ కంపెనీలు చెబుతున్నాయి. 

టార్గెట్‌ 2030

ఎకనామిక్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. 2030 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 45శాతం మంది మహిళలే విధులు నిర్వహించేలా  ఇన్ఫోసిస్‌ భారీ ఎత్తున ప్రణాళికను సిద్ధం చేసింది.

టీసీఎస్‌ సైతం 40వేల మంది మహిళా గ్రాడ్యూయేట్ లలో  15 వేల నుంచి 18వేల లోపు మహిళా ఉద్యోగుల నియమాకం కోసం కసరత్తు. 

రాబోయే రోజుల్లో మహిళలు - పురుషుల ఉద్యోగుల సంఖ్య సమానంగా ఉండేలా హెచ్‌సీఎల్‌ నియామకం చేపట్టనుంది. ఇందుకోసం 60 శాతం మహిళా ఉద్యోగుల్ని ఆయా క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా నియమించుకోవాలని ప్లాన్‌ చేస్తోంది. 

విప్రో ఉద్యోగుల్లో 50శాతం మంది మహిళలు ఉండేలా ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగా క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా 30వేల మందిని ఎంపిక చేసేలా డ్రైవ్‌ నిర్వహించనుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు