ఎగబడి మరీ కొంటున్నారు, మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్‌ 5 స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే!

20 Apr, 2022 16:22 IST|Sakshi

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావాలు స్మార్ట్‌ ఫోన్‌ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో మొబైల్‌ షిప్‌మెంట్‌ 11శాతం పడిపోయాయి. ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధ పరిణామాలు, కరోనా కేసులు పెరిగిపోతుండడం, రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షల కారణంగా మొబైల్‌ షిప్‌ మెంట్‌ పడిపోయిందంటూ ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ కెనాలసిస్‌ తెలిపింది.

షిప్‌మెంట్‌ పడిపోయిన సంస్థల్లో శాంసంగ్‌ తొలిస‍్థానంలో ఉండగా యాపిల్‌,షావోమీ వరుస స్థానాల్లో ఉన్నట్లు కెనాలసిస్‌ తన నివేదికలో పేర్కొంది. అదే సమయంలో ఐఫోన్‌ 13, ఐఫోన్‌ ఎస్‌ఈ ఫోన్‌లకు మార్కెట్‌లో డిమాండ్‌ విపరీతంగా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత షావోమీకి చెందిన రెడ్‌ మీ నోట్‌ సిరీస్‌, ఒప్పో సంస్థకు చెందిన వన్‌ ప్లస్‌, వివో స‍్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలు జరిగినట్లు గుర్తు చేసింది. 

ఈ సందర్భంగా కెనాలసిస్‌ అనలిస్ట్‌ సన్యాం చౌరాసియా (Sanyam Chaurasia) మాట్లాడుతూ.. యాపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్‌ 13 మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నట్లు తెలిపారు. మిడ్‌ రేంజ్‌ ఫోన్‌లలో ఇటీవల మార్చిలో విడుదలైన ఐఫోన్‌ ఎస్‌ఈ సైతం యూజర్లను ఆకట్టుకుందని చెప్పారు. ఇక చిప్‌ సెట్‌లను అప్‌గ్రేడ్‌ చేసి బ్యాటరీ పర్మామెన్స్ తో పాటు 5జీ స్మార్ట్‌ ఫోన్‌లు సైతం యూజర్లను ఆకర్షిస్తున్నాయని వెల్లడించారు.

చదవండి: సూపర్‌ ఫీచర్స్‌తో షావోమీ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌..! లాంచ్‌ ఎప్పుడంటే..?

మరిన్ని వార్తలు