2022లో భారత మార్కెట్లపై స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల దండయాత్ర..! వచ్చే ఏడాదిలో రానున్న పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే..

21 Dec, 2021 16:28 IST|Sakshi

Top Upcoming Smartphones Of 2022: కొత్త ఏడాది రాబోతుంది. 2022 సంవత్సరానికి గాను ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం  కంపెనీలు భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లపై తమ కొత్త ఫోన్లతో దండయాత్ర చేయనున్నాయి. 2021లో చిప్స్‌ సమస్య, సప్లై చైయిన్‌లో ఆటంకాలు కల్గించినప్పటికీ భారత స్మార్ట్‌ఫోన్‌​ మార్కెట్లలో దిగ్గజ కంపెనీలు కొంతమేర లాభాలను దక్కించుకున్నాయి. 2022గాను  భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లను శాసించేందుకు ఆయా కంపెనీలు సిద్దమైనాయి. 

శాంసంగ్‌, యాపిల్‌, వన్‌ప్లస్‌, షావోమీ, గూగుల్‌, ఒప్పో కంపెనీలు 2022లో కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్స్‌ లాంచే చేసేందుకు రెడీ అయ్యాయి. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లలో తమ స్థానాలను పదిలంగా ఉంచేందుకు ఆయా కంపెనీలు ఊవిళ్లురుతున్నాయి.

2022లో రానున్న పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే..!

1. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లలో భారీ ఆదరణ లభించింది. పవర్‌ఫుల్‌ కెమెరా సపోర్ట్‌తో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 నిలిచింది. దీనిని కంటిన్యూ చేస్తూ శాంసంగ్‌ మరిన్ని అద్బుతమైన ఫీచర్స్‌తో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 అల్ట్రాను శాంసంగ్‌ లాంచ్‌ చేయనుంది. Galaxy S22, Galaxy S22 Plus మరియు Galaxy S22 అల్ట్రాకు సంబంధించిన  వీడియో వైరల్‌గా మారింది. 


2. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ఎఫ్‌ఈ 

గెలాక్సీ సిరీస్‌లో భాగంగా శాంసంగ్‌ తక్కువ ధరకే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్‌ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 38,990గా ఉండనుంది. IP68 రేటింగ్ వంటి లక్షణాలను శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ఎఫ్‌ఈ పొందనుంది. 5జీ మోడల్‌, క్వాలకం స్నాప్‌డ్రాగన్‌ 865 సపోర్ట్‌తో రానుంది. 


3. ఐఫోన్‌ 14 మ్యాక్స్‌

కరోనా రాకతో ఐఫోన్‌13 స్మార్ట్‌ ఫోన్ల లాంచ్‌కు కాస్త బ్రేకులు పడింది. లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా ఐఫోన్‌ 13 భారత మార్కెట్లలో భారీ ఆదరణను పొందింది. కాగా వచ్చే ఏడాది అనుకున్న సమయానికే ఐఫోన్‌ 14 స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేసేందుకు యాపిల్‌ సన్నాహాలను చేస్తోంది. ఐఫోన్ 14 మ్యాక్స్‌కు అనుకూలంగా ఐఫోన్ 14 మినీని తొలగించవచ్చని తెలుస్తోంది. అంటే మినీ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఇకపై ఉండకపోవచ్చును. 

4. వన్‌ప్లస్‌ 10 ప్రొ

శాంసంగ్‌, యాపిల్‌ లాంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు వన్‌ప్లస్‌ దీటైన సమాధానం ఇచ్చింది. వచ్చే ఏడాది వన్‌ప్లస్‌ 10 స్మార్ట్‌ఫోన్లను కంపెనీ రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్‌ 9 కంటే అదిరిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్‌ 10 స్మార్ట్‌ ఫోన్స్‌ రానున్నాయి.  Qualcomm స్నాప్డ్రాగెన్ 8 Gen 1 ప్రాసెసర్ దీనిలో రానుంది. 

5. షావోమీ 12

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ భారత్‌లో పాతుకుపోయింది. షావోమీ స్మార్ట్‌ఫోన్స్‌కు భారీ ఆదరణ లభించడంతో వివిధ రకాల మోడల్‌ స్మార్ట్‌ఫోన్లను షావోమీ లాంచ్ చేస్తోంది. షావోమీ 12 స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాదిలో తొలినాళ్లలో లేదా ఈ ఏడాది చివరన లాంచ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు 2022లోనే అందుబాటులో ఉండనుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 67 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో షావోమీ 12 రానుంది. 

6. గూగుల్‌ పిక్సెల్‌ 6ఏ 

యాపిల్‌ స్మార్ట్‌ఫోన్స్‌ తరువాత గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్స్‌కు ఉండే క్రేజ్‌ వేరు. పవర్‌ఫుల్‌ సెక్యూరిటీతో, కెమెరా ఆప్షన్లతో గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్స్‌ భారత్‌లో తనదైన స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్‌ పిక్సెల్‌ 6, 6 ప్రొ ఇప్పటికే లాంచ్‌ ఐనప్పటికీ వచ్చే ఏడాది బడ్జెట్‌ ప్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్‌లో భాగంగా గూగుల్‌ పిక్సెల్‌ 6ఏ ఫోన్‌ను గూగుల్‌ లాంచ్‌ చేయనుంది. 

7. ఒప్పో ఫైండ్‌ ఎన్‌

ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్లలోకి ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో కూడా ప్రవేశించింది. ‘ఒప్పో ఫైండ్‌ ఎన్‌’ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్‌ 15న కంపెనీ లాంచ్‌ చేసింది. కాగా తొలుత చైనా మార్కెట్లలోనే ఈ ఫోన్‌ అందబాటులో ఉండనుంది. ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లలో ప్రఖ్యాతిగాంచిన శాంసంగ్‌ కంపెనీ స్మార్ట్‌ఫోన్లకు తక్కువ ధరలోనే ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో తీసుకువచ్చింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 92,000 నుంచి ప్రారంభమవుతుంది.  ఒప్పో ఫైండ్‌ ఎన్‌ స్మార్ట్‌ఫోన్‌ 33 వాట్‌ సూపర్‌ఫ్లాష్‌ టెక్నాలజీతో పనిచేయనుంది. అయితే 33W SUPERVOOC ఫ్లాష్ ఛార్జ్ 30 నిమిషాల్లో 55 శాతానికి , 70 నిమిషాల్లో 100 శాతానికి బ్యాటరీ ఛార్జ్‌ అవ్వనుంది. 

చదవండి: వరల్డ్‌ ఫస్ట్‌ ఇన్నోవేటివ్‌ ఫీచర్స్‌ కేవలం ఈ స్మార్ట్‌ఫోన్‌లో...!


 

మరిన్ని వార్తలు