అమెజాన్‌లో రూ.96 వేల తోషిబా ఎయిర్ కండిషనర్ రూ.6 వేలకే!

6 Jul, 2021 18:49 IST|Sakshi

అప్పుడప్పుడు ఈ-కామర్స్ కంపెనీలు ప్రత్యేక సేల్ పేరుతో చాలా తక్కువ ధరకే ప్రొడక్టులను సేల్ చేస్తుంటాయి. కానీ, ఈ సారి ఎటువంటి ఆఫర్ లేకున్నా అమెజాన్, ఈ కామర్స్ వెబ్ సైట్ సోమవారం రూ.96,700 తోషిబా ఎయిర్ కండిషనర్(ఎసీ)ను 94 శాతం డిస్కౌంట్ తో రూ.5900కు తీసుకొచ్చింది. అయితే, అమెజాన్‌లో తలెత్తిన చిన్న సాంకేతిక సమస్య కారణంగా రూ.5,900కు తోషిబా 2021 రేంజ్ స్ప్లిట్ సీస్టమ్ ఎసీని లిస్టింగ్ అయినట్లు తెలుస్తోంది. దీని అసలు ధర రూ.96,700, కొంత మంది కస్టమర్లు ఈ ఆఫర్ కింద దీన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. జూలై 5న అమెజాన్ లో ఈ ఎయిర్ కండిషనర్ అసలు ధర రూ.96,700పై రూ.90,800 డిస్కౌంట్ ఇస్తున్నట్లు కనిపించింది. 

ప్రస్తుతం అమెజాన్ అదే తోషిబా 1.8 టన్నుల 5-స్టార్ ఇన్వర్టర్ ఏసీని రూ.59,000కి లభిస్తుంది. దీని అసలు ధర కంటే 30 శాతం డిస్కౌంట్ తో ఇప్పుడు లభిస్తుంది. ఇన్వర్టర్ ఎసీ కొన్ని ప్రత్యేక ఫీచర్లలో యాంటీ బాక్టీరియల్ కోటింగ్, డస్ట్ ఫిల్టర్, డీహ్యూమిడిఫైయర్ ఉన్నాయి. తోషిబా ఎసీ కంప్రెసర్, పీసీబీలు, సెన్సార్లు, మోటార్స్, ఎలక్ట్రికల్ పార్టులపై 9 సంవత్సరాల అదనపు వారెంటీతో పాటు 1 సంవత్సరం అదనపు వారెంటీని కూడా లభిస్తుంది. ఎసీ 3.3 సీజనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియో(ఎస్ఈఆర్)ని కలిగి ఉంది.

అమెజాన్ ఇలా తక్కువ ధరకే విలువైన ఉత్పత్తులను తీసుకొని రావడం ఇది మొదటిసారి కాదు. 2019 ప్రైమ్ డే సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం రూ.9 లక్షల విలువైన కెమెరా గేర్ ను రూ.6,500కు విక్రయించింది. ఒక్కసారిగా ఈ ఆఫర్ గురుంచి తెలుసుకోవడంతో దానిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఎగబడ్డారు. ఈ లోపాన్ని గుర్తించిన అమెజాన్ ఆ ఆఫరా నిలిపివేసింది. జూలై 5న కూడా అమెజాన్లో తలెత్తిన చిన్న లోపం వల్ల రూ.59,000 లభించే ఏసీ రూ.5,900కి లభించింది.


 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు