Tokyo Olympics: బాస్కెట్‌బాల్‌ కోర్టులో ఔరా అనిపిస్తోన్న రోబోట్‌..!

2 Aug, 2021 18:00 IST|Sakshi

టోక్యో:  ఈ ఏడాది జూలై 23న టోక్యో వేదికగా ప్రారంభమైన విశ్వ క్రీడలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.  ఒకవైపు తమ ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శనతో ఆయా దేశాలు ఆనందంలో పరవశించిపోతుంటే, మరొకవైపు రోబోటిక్స్‌ విన్యాసాలు కూడా చూపరులను ఆకట్టుకుంటున్నాయి.  ఒలింపిక్స్‌ బాస్కెట్‌బాల్‌ ఈవెంట్‌లో భాగంగా కోర్టులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బాస్కెట్‌ బాల్‌ కోర్టులో  95వ జెర్సీ నంబర్‌ ధరించిన ఓ ప్లేయర్‌  పద్దతిగా..ఒక లైన్‌ గీసిన్నట్లుగా..100శాతం కచ్చితత్వంతో కోర్టులో ఆయా ప్లేస్‌ల నుంచి బాల్‌ వేస్తే ఏకధాటిగా గోల్‌ పోస్ట్‌ల్లోకి వెళుతూనే ఉన్నాయి.

ఇది అక్కడ ఆశ్చర్యానికి గుర్యయేలా చేసింది. ఇంతకు 95 నంబర్‌ జెర్సీ ధరించిన ప్లేయర్‌ ఎవరనీ అనుకుంటున్నారా..! వరుసగా గోల్స్‌ చేస్తూన్న 95 నంబర్‌ ప్లేయర్‌ ఎవరంటే.ఒక రోబోట్‌..! అవును మీరు విన్నది నిజమే..! ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో తయారుచేసిన ఈ రోబోట్‌ బాస్కెట్‌బాల్‌ కోర్టులో వరుసపెట్టి గోల్స్‌ సాధిస్తూనే ఉంది.

ఈ అద్భుత సన్నివేశం యూఎస్‌ఏ వర్సెస్‌ ఫ్రాన్స్‌కు మధ్య  జరిగే బాస్కెట్‌బాల్‌లో పోటీలో కనిపించాయి . కాగా ఈ ఏఐ రోబోట్‌ను టయోటా సంస్థ రూపొందించింది. గత సంవత్సరం ఏఐ రోబోట్‌ జపాన్‌లో నిర్వహించిన షూటౌట్‌లో ఏకధాటిగా 11 గోల్స్‌ను సాధించింది. ప్రస్తుతం టయోటా ఇంజనీర్లు రూపొందించిన ఈ ఏఐ రోబోట్‌ను ముద్దుగా ‘క్యూ’ అని పిలుస్తున్నారు. క్యూ రోబోట్‌ బాస్కెట్‌బాల్‌ ఆడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నెటిజన్లు క్యూ రోబోట్‌ను బాస్కెట్‌బాల్‌ ఆటలో ప్రఖ్యాతిగాంచిన ఫిలడెల్ఫియా గార్డ్‌ బెన్‌ సిమన్స్‌తో పోల్చారు. అంతేకాకుండా టోక్యోఒలింపిక్స్‌లో క్రీడాకారులే కాదు..! రోబోట్‌లు కూడా మెడల్స్‌ సాధిస్తాయని ట్విటర్‌లో పేర్కొంటున్నారు. 

క్యూ ఎలా పనిచేస్తుందంటే..!
క్యూ రోబోట్‌ను టయోటా ఇంజనీర్లు ప్రత్యేక సెన్సార్లను ఏర్పాటుచేశారు. ఈ సెన్సార్ల సహాయంతో గోల్‌ పోస్ట్‌కు, క్యూ రోబోట్‌కు మధ్య ఉన్న దూరాన్ని అనలైజ్‌ చేసి గోల్స్‌ను సాధిస్తుంది. క్యూ మరింత సులువుగా కోర్టులో తిరగడం కోసం దాని పాదాలకు చక్రాలను అమర్చారు.  టయోటా శాస్త్రవేత్తలు క్యూ రోబోట్‌ తొలి వెర్షన్‌ను 2017లో తయారుచేశారు. 

మరిన్ని వార్తలు