సైంటిస్టులే కాదు.. సామాన్యులు వెళ్లొచ్చట జాబిల్లిపైకి !

28 Jan, 2022 18:43 IST|Sakshi

జాబిల్లి పైకి సామాన్యులను తీసుకెళ్లేలా ఓ క్రూయిజర్‌ వెహికల్‌ని తయరుచేసే పనిలో ఉంది టయోటా. జపాన్‌ ఎయిరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ (జాక్సా)తో జాయింట్‌ వెంచర్‌గా ఈ లూనార్‌ క్రూయిజర్‌ వెహికల్‌ని అభివృద్ధి చేస్తోంది. 2030 చివరినాటికి వాహనం సిద్ధమవుతుందని టయోటా అంటోంది. అంతేకాదు 2040 కల్లా మార్స్‌ మీదికి కూడా వెళ్లవచ్చని చెబుతోంది. 

తాము అభివృద్ధి చేసే లూనార్‌ ‍క్రూయిజర్‌ వెహికల్‌ చంద్రుడికి మీదకు తీసుకెళ్లడమే కాదు అక్కడ మనుషులు తిరిగేందుకు అనువైన ఏర్పాట్లు కూడా చేయగలదని హామీ ఇస్తోంది టయోటా. లూనార్‌ లాండ్‌ ‍క్రూయిజర్‌లోనే చంద్రుడిపై తిరిగేందుకు , తాత్కాలికంగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. స్పేస్‌ టెక్నాలజీకి సంబంధించి వందేళ్లకు ఓ సారి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని, ప్రస్తుతం తాము అదే తరహా టెక్నాలజీపై పని చేస్తున్నట్టు టయోటా చెబుతోంది. భూమిపై వాహనాల్లో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లినట్టుగా చంద్రుడిపైకి ప్రయాణాలు చేయించాలన్నది తమ లక్ష్యమని చెబుతోంది.

చదవండి:జాబిలి వైపు భారీ రాకెట్‌.. లాంఛ్‌ కాదు ఢీ కొట్టడానికి! 

మరిన్ని వార్తలు