టయోటా హైలక్స్ యాడ్ బ్యాన్ చేసిన యూకే - కారణం ఇదే!

25 Nov, 2023 21:20 IST|Sakshi

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న జపనీస్ వాహన తయారీ దిగ్గజం 'టయోటా' (Toyota)కు యూకేలో గట్టి షాక్ తగిలింది. సామాజిక బాధ్యత ప్రమాణాలను ఉల్లంఘించినందుకు కంపెనీ ప్రకటనను నిషేధిస్తూ ఏఎస్ఏ ఆదేశాలు జారీ చేసింది. టయోటా హైలక్స్ యాడ్ నిలిపేయడం వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? గతంలో ఇలాంటి నిషేధాలు విధించారా? అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..

యూకే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ASA) పర్యావరణ బాధ్యతారహిత డ్రైవింగ్‌ను ప్రోత్సహిస్తున్న రెండు టయోటా ప్రకటనలను నిషేధించింది. ఇందులో ఒకటి పోస్టర్, మరొకటి వీడియో. 

వీడియోలో టయోటా హైలెక్స్ పికప్ ట్రక్కులు కఠినమైన భూభాగాల్లో న్యావిగేట్ చేస్తున్నాయి. ఇందులో రివర్స్ క్రాసింగ్ కూడా ఉంది. ఆ తరువాత పట్టణ ప్రాంతం గుండా వెళ్లడం చూడవచ్చు. రోడ్డులో వాటికవి విడిపోవడం చూడవచ్చు. ఇవన్నీ వినియోగదారులను కొంత తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని చెబుతున్నారు.

పోస్ట్ విషయానికి వస్తే.. ఇందులో తిరగటానికే పుట్టాను అన్నట్లు రాసి ఉంది. అంతే కాకుండా కొండల్లో దిగటం, ఎత్తైన ప్రదేశాల్లో దుమ్ములేపుకుంటూ ప్రయాణించడం వంటివి ఇందులో చూడవచ్చు. ఈ ప్రకటనలు పర్యావరణ హానికరమైన ప్రవర్తనను ఆమోదించాయని, అధిక కార్బన్ ఉత్పత్తులు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ.. ఈ ప్రకటనలను నిషేదించింది.

ఈ ప్రకటనలపై అడ్‌ఫ్రీ సిటీస్‌ కో-డైరెక్టర్ వెరోనికా విగ్నాల్ మాట్లాడుతూ.. వాహనాలు నదులు, అడవి గడ్డి మైదానాల గుండా వేగంగా డ్రైవింగ్ చేస్తే.. ప్రకృతి దెబ్బతింటుందని చెబుతూ, యూకేలో చాలా వాహనాలు పట్టాన ప్రాంతాలకు పరిమితమయ్యాయి. అలాంటిది ఇలాంటి ప్రకటలను ఎలా చిత్రీకరిస్తారని వాదించింది.

ఇదీ చదవండి: లక్షల విలువ చేసే కారులో 'హోమ్ మేడ్ ఫుడ్' బిజినెస్.. వీడియో వైరల్

ఈ ప్రకటనను కంపెనీ సమర్థిస్తూ.. వ్యవసాయ, అటవీ ప్రాంత వాసులకు ఇలాంటి కార్లు చాలా ఉపయోగపడతాయని చెప్పినప్పటికీ, ప్రకటనలో అలాంటి కార్మికులు కనిపించలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. కానీ ఫుటేజీని యూకే వెలుపల ఉన్న ప్రైవేట్ భూమిలో చిత్రీకరించినట్లు, పోస్టర్ మాత్రం కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేసినట్లు ప్రతినిధి స్పష్టం చేశారు. ఇందులో మళ్ళీ  మార్పులు చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు