Toyota: అమెరికాలో అత్యంత ప్రజాదరణను పొందిన టయోటా కార్‌ ఇప్పుడు భారత్‌లో..!

9 Dec, 2021 22:18 IST|Sakshi

పికప్‌ ట్రక్‌ వాహనాల్లో జపనీస్‌ కంపెనీ ఇసుజుకు సాటిలేదు. ఇసుజు డీ మ్యాక్స్‌ వీ క్రాస్‌ వాహనాలకు పోటీగా ప్రత్యర్థి జపనీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం  టయోటా భారత మార్కెట్లలోకి సరికొత్త పికప్‌ ట్రక్‌ను లాంచ్‌ చేయనుంది.  అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో  అత్యంత ప్రజాద‌ర‌ణను పొందిన ‘హిల‌క్స్’ పిక‌ప్ వాహ‌నాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో భారత్‌లో లాంచే చేసేందుకు టయోటా ఇండియా స‌న్న‌హాలు చేస్తోంది.


ఇసుజుకు హిల‌క్స్ దీటైన పోటీ ఇవ్వ‌నుంది. టయోటా భారత్‌లో ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవాలకు భారీ ఆదరణను సంపాదించింది. అదే నిర్మాణంతో టయోటా హిల‌క్స్ కూడా ఉండనుంది.టయోటా హిల‌క్స్ 3000ఎంఎం వీల్‌బేస్‌తో రానుంది. టూ డోర్‌, ఫోర్ డోర్ కాన్ఫిగ‌రేష‌న్స్‌తో ల‌భించనుంది. ఎల్ఈడీ డే టైమ్‌ ర‌న్నింగ్ లైట్స్‌, లాంగ్ స్లిట్ హెడ్‌ల్యాంప్స్  అమర్చారు. వీటితో పాటుగా 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే వంటి ఇంటీరియర్స్ ను కల్గి ఉంది. టయోటా  ఫార్చూన‌ర్ కంటే త‌క్కువగా రూ 25-35 ల‌క్ష‌ల మ‌ధ్య హిలక్స్‌ ఉండనుంది. 

ఇంజిన్‌ విషయానికి వస్తే..!
కంపెనీ ఇంజిన్‌కు సంబంధించిన విషయాలను ఇంకా వెల్లడించలేదు. అయితే ఇండియా-స్పెక్ టయోటా హిలక్స్ డీజిల్ యూనిట్ ద్వారా శక్తిని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది., ఇది టయోటా ఫార్చ్యూనర్ మాదిరి 2.8-లీటర్ యూనిట్ 4x4 టాప్-స్పెక్ వేరియంట్‌గా ఉండనుంది.  ఇంజన్ 201bhp సామర్థ్యంతో  500Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

చదవండి: కరోనా ఉన్నప్పటికీ.. రూ. 228 లక్షల కోట్లకు చేరిన క‍ంపెనీలు..!

మరిన్ని వార్తలు