ఒకరి తర్వాత ఒకరు.. వరుసగా బాదుడే బాదుడు..

26 Mar, 2022 17:17 IST|Sakshi

ఉక్రెయిన్‌ యుద్దమో, అమెరికాలో ద్రవ్యోల్బణమో, చిప్‌సెట్ల కొరతనో క్రూడ్‌ ఆయిల్‌ ధరలో పెరుగుదలో.. కారణం ఏదైతేఏం ధరల బాదుడు షురూ అయ్యింది. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మొదలు ఆటోమొబైల్స్‌ వరకు వరుసగా అన్నింటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా టయోటా కిర్లోస్కర్‌ తమ వాహనాల ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది.

ఎంపీయూ సెగ్మెంట్‌లో టయోటా ఇన్నోవాకి ఎస్‌యూవీలో టయోటా ఫార్చునర్‌లదే రాజ్యం. ఎంట్రీ లెవల్‌ నుంచి సెడాన్‌ల వరకు అనేక మోడళ్లను ఇండియాలో అందిస్తోంది టయోటా. అయితే ఇన్‌పుట్‌ కాస్ట్‌ పెరిగినందున తమ కంపెనీ కార్ల ధరలను 4 శాతం పెంచుతున్నట్టు టయోటా ప్రకటించింది. పెరిగిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. 

ఇప్పటికే బీఎండబ్ల్యూ, ఆడి వంటి కంపెనీలు ఏప్రిల్‌ 1 నుంచి తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. అంతకు ముందే మారుతి, టాటాలు ఈ పని చేశాయి. ఓవైపు ఎలక్ట్రిక్‌ కార్ల నుంచి తీవ్రపోటీ ఉన్నా ధరలను పెంచేందుకు ఆటోమొబైల్‌ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.

చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, 'ఆడీ' కి షాక్‌!

మరిన్ని వార్తలు