Toyota: సరికొత్త హంగులతో టయోటా ఇన్నోవా..!

20 Oct, 2021 16:03 IST|Sakshi

Toyota Innova Crysta Limited Edition Launched: ప్రముఖ ఆటోమొబైల్‌ తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ సరికొత్త హంగులతో  ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్‌ ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది. ఇన్నోవా క్రిస్టా మోడల్‌ భారత్‌ మార్కెట్లలో అధికంగా సేల్‌ ఐనా ఎమ్‌పీవీ(మల్టీపుల్‌ పర్పస్‌ వెహికిల్‌)గా ప్రజాదరణ పొందింది. ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్‌ ఎడిషన్‌ ధర ఎక్స్‌షోరూంలో పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.17.18–18.59 లక్షల మధ్య ఉండగా, డీజిల్‌ వేరియంట్స్‌ రూ.18.99–20.35 లక్షల కు అందుబాటులో ఉండనుంది.

ఇన్నోవా క్రిస్టా లిమిడెట్‌ ఎడిషన్‌ మోడల్‌ 7-సీటింగ్‌, 8-సీటింగ్‌ వేరింయట్స్‌తో అందుబాటులో ఉండనుంది. ఈ కారులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ విత్‌ ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆటో హెడ్‌ ల్యాప్స్‌, ఆటో క్లైమట్‌ కంట్రోల్‌, సెవన్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ అందుబాటులో ఉండనున్నాయి. భారత్‌లో  టయోటా 2005 నుంచి సుమారు 9 లక్షలకు పైగా ఇన్నోవా కార్లను సేల్‌ చేసింది.   
చదవండి: అదృష్టం అంటే వీళ్లదే..! పెట్టుబడి రూ.లక్ష..సంపాదన కోటి రూపాయలు

కొత్త ఫీచర్స్‌ ఇవే...!
ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్‌ ఎడిషన్‌లో.. 360 డిగ్రీ కెమెరా,  మల్టీ టెరేయిన్‌ మానిటర్, హెడ్‌ అప్‌ డిస్‌ప్లే, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్, వైర్‌లెస్‌ చార్జర్, డోర్‌ ఎడ్జ్‌ లైటింగ్ విత్‌ 16 కలర్‌​ ఆప్షన్స్‌, ఎయిర్‌ అయోనైజర్‌ వంటి హంగులను ఇన్నోవా క్రిస్టాలో టయోటా జోడించింది. 

ఇంజిన్‌ విషయానికి వస్తే..!
ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్‌ ఎడిషన్‌ 2.7 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ వేరియంట్‌ 164బీహెచ్‌పీ వద్ద గరిష్టంగా 245ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. 2.4 లీటర్‌ డిజీల్‌ ఇంజిన్‌ వేరియంట్‌ 148బీహెచ్‌పీ వద్ద గరిష్టంగా 343ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది.  

చదవండి: మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైన రిషబ్‌ పంత్‌..! దినేష్‌ కార్తీక్‌ సరసన...!

మరిన్ని వార్తలు