50వేల మంది ఇష్టపడి కొన్న కారు ఇదే!.. ఎందుకింత డిమాండ్ అంటే..

23 Feb, 2024 15:21 IST|Sakshi

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) కంపెనీ ఇన్నోవా హైక్రాస్ అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. 2022లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 50వేల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. 

ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హైక్రాస్ అమ్మకాలు ఇప్పటికి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందులో భాగంగానే కంపెనీ ఈ మోడల్ టాప్ వేరియంట్ బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా వెయిటింగ్ పీరియడ్ కూడా 12 నుంచి 13 నెలల సమయం ఉన్నట్లు సమాచారం.

డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ 5వ జనరేషన్ సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టం కలిగి 187 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈ డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్‌తో కూడిన మోనోకోక్ ఫ్రేమ్‌తో శక్తిని పొందుతుంది. ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అంతకు మించిన పర్ఫామెన్స్ కలిగి ఉండటం వల్ల కస్టమర్లు ఈ కారును ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు.

హైక్రాస్ ఉత్తమ అమ్మకాలు 50వేలు దాటిన సందర్భంగా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ.. కేవలం 14 నెలల్లో 50000 యూనిట్ల హైక్రాస్ అమ్మకాలు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కస్టమర్లు మా ఉత్పత్తుల మీద ఉంచుకున్న నమ్మకానికి కృతజ్ఞులం అన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు