అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కొత్త ఎలక్ట్రిక్‌ కార్‌..రేంజ్‌ దుమ్ము దులిపేస్తుంది!

13 Apr, 2022 16:19 IST|Sakshi

టెక్నాలజీ శరవేగంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో వాహన కొనుగోలు దారుల అభిరుచి మారింది. పెరిగి పోతున్న ఇందన ధరలతో పాటు కొత్త దనాన్ని కోరుకుంటున్నారు. అందుకే ఆటోమొబైల్‌ సంస్థలు సాంప్రదాయ వెహికల్స్‌ ఉత్పత్తి తగ్గిస్తున‍్నాయి. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను పరిచయం చేస్తున్నాయి. తాజాగా జపాన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సంస్థ తొలి ఎలక్ట్రిక్‌ వెహికల్‌ 'టయోటా బీజెడ్‌4ఎక్స్‌'ను లాంచ్‌ చేసింది.

టయోటా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఫీచర్లు  
టయోటా బీజెడ్‌4ఎక్స్‌ కారు పొడవు ఆర్‌ఏవీ4 ఎస్‌యూవీని తరహాలో ఉంది.  వీల్‌బేస్‌ 15 సెంటీమీటర్ల పొడవు, 5ఎంఎం విడ్త్‌ ఉండగా..టయోటా మిడ్‌ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ కారులో ప్రత్యేకగా లెగ్‌ రూమ్‌ పొడవు ఉండేలా డిజైన్‌ చేసింది. ఇక ప్రత్యేకంగా బరువు తగ్గించడంతో పాటు, ఉత్పత్తి అయ‍్యే ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అత్యధికంగా మైలేజ్‌ ఇచ్చే ఫంట్ర్‌ వీల్‌ డ్రైవ్‌(ఎఫ్‌డబ్ల్యూడీ), బెటర్‌ ఫర్మామెన్స్‌, సుపీరయర్‌ ట్రాక్షన్‌ వంటి ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌(ఏడబ్ల్యూడీ)ను అందిస్తుంది.

కారు రేంజ్‌ 559కిలో మీటర్లు
డ్రైవింగ్‌ సమయంలో స్టీరింగ్‌ దగ్గర బయటి నుంచి కారు లోపలికి వినిపించే శబ్ధాలు రాకుండా చేస్తుంది. అంతేకాదు స్మార్ట్‌ ఫోన్‌ కోసం  వైర్‌లెస్ట్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌,యూఎస్‌బీ సీ, ఏ పోర్ట్‌ తో పాటు  12.3అంగుళాల మల్టీమీడియా సిస్టమ్‌, ఒకేసారి 5డివైజ్‌లను కనెక్ట్‌ చేసుకునేలా  4జీ మోడెమ్‌, 9స్పీకర్ల జేబీఎల్‌ స్పీకర్‌ సిస్టమ్‌, 8 ఛానెళ్ల 800డబ్ల్యూ యాంపిప్లైర్‌, 9అంగుళా సబ్‌ వూఫర్‌ను అందిస్తుంది. 

ఇక సింగిల్‌ ఛార్జ్‌తో ఎఫ్‌డబ్ల్యూడీ మోడల్‌ కారు రేంజ్‌ 559కిలోమీటర్లు ఉండగా ఏడబ్ల్యూడీ కారు రేజ్‌ 540 కిలోమీటర్లుగా ఉంది. అదే ఎస్‌యూవీ కారు ఎఫ్‌డబ్ల్యూడీ కారు 0-100కేఎంపీఎస్‌ను 7సెకండ్స్‌లో, ఏడబ్ల్యూడీ వేరియంట్‌ కారు 6.5 సెకండ్స్‌లో వెళ‍్తుంది.    

తొలిసారి డిజిటల్‌ కీ
టయోటా కారు ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రిక్‌ కారులో 'డిజిల్‌ కీ'ని డిజైన్‌ చేసింది.ఈ 'డిజిటల్‌ కీ'ని ఒకరి నుంచి మరొకరికి స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా సెండ్‌ చేసే సదుపాయం ఉంది. టయోటా బీజెడ్‌4ఎక్స్‌ కారు ఫంట్ర్‌ వీల్‌ డ్రైవ్‌లో హార్స్‌ పవర్‌ 201 హెచ్‌పీ,  ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌, హార్స్‌ పవర్‌ను అందిస్తుంది.  

చదవండి: టాటా సరికొత్త సంచలనం..కొత్త ఎలక్ట్రిక్ కారుతో ప్రత్యర్ధి కంపెనీలకు చుక్కలే! 

>
మరిన్ని వార్తలు