టయోటాలో అత్యంత సరసమైన ధరలో కార్‌..!  ధర ఎంతంటే..!

15 Mar, 2022 17:06 IST|Sakshi

ప్రముఖ జపనీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా  దేశీయ మార్కెట్లోకి 2022 టయోటా గ్లాంజాను లాంచ్ చేసింది. భారత్‌లోని టయోటా కార్లలో 2022 టయోటా గ్లాంజా అత్యంత సరసమైన ధరలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుందని కంపెనీ ప్రకటించింది. 

ఇంజన్‌ విషయానికి వస్తే..!
2022 టయోటా గ్లాంజా 1.2 లీటర్, ఫోర్‌ సిలిండర్‌ డ్యుయల్‌జెట్‌ కే12ఎన్‌ పెట్రోల్ ఇంజిన్ తో 90hp పవర్ తో 113 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇందులో 5 స్పీడ్ ఆటో, మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరింయట్లలో అందుబాటులో ఉండనుంది. 

డిజైన్‌లో స్టైలిష్‌ లుక్‌తో..!
2022 టయోటా గ్లాంజా కార్ ముందుబాగం స్టైలిష్ లుక్‌ వచ్చేలా కంపెనీ డిజైన్‌ చేసింది. బంపర్, ముందు గ్రిల్, హెడ్ లైట్, ఎల్ఈడీ లైట్స్ గ్రాఫిక్స్ డిజైన్ లో గ్లాంజా కొత్తదనాన్ని కలిగి ఉండనుంది. వేరువేరు మోడళ్లలో లభించే ఫీచర్లు మారనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 360-డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ‘టయోటా ఐ-కనెక్ట్’ కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టిల్ట్ , టెలిస్కోపిక్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన స్టీరింగ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో రానున్నాయి. 

బాలెనో, ఆల్ట్రోజ్ వంటి కార్లకు పోటీగా..!
2022 టయోటా  గ్లాంజా కొద్ది వారాల క్రితం మారుతి సుజుకి లాంచ్‌ చేసిన బాలెనో, టాటా ఆల్ట్రోజ్‌, హ్యుందాయ్‌ ఐ20, ఫోక్స్‌వేగన్‌ పోలో, హోండా జాజ్‌ కార్లకు పోటీగా నిలుస్తోందని టయోటా కిర్లోస్కర్‌  మోటార్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

ధర ఏంతంటే..?
టయోటా గ్లాంజా మొత్తంగా నాలుగు ట్రిమ్‌ లేవల్స్‌లో రానుంది. గ్లాంజా ధరలు రూ. 6.39 లక్షల నుంచి ప్రారంభంకానున్నాయి. కంపెనీకి చెందిన డీలర్‌షిప్‌లు, వెబ్‌సైట్ ద్వారా కేవలం రూ.11,000తో ప్రి బుకింగ్స్‌ను టయోటా గత వారం ప్రారంభించింది. 

చదవండి:  మైలేజ్‌లో రారాజు..మారుతి సుజుకీ రికార్డుల హోరు..! 10 లక్షలకుపైగా..

మరిన్ని వార్తలు