Toyota bZ4X EV: తొలి ఈవీతో వచ్చిన గండం.. టయోటాకు తప్పని తిప్పలు..

23 Jun, 2022 20:49 IST|Sakshi

ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలో అనేక దేశాల్లో మంచి పేరున్న టయోటాకు తొలి ఎలక్ట్రిక్‌ వెహికల్‌తో ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఎంతో అర్భాటంగా ఇటీవల టయోటా తమ సంస్థ తరఫున బీజెడ్‌4ఎక్స్‌ పేరుతో ఎస్‌యూవీ కారుని మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. టయోటా పేరుకున్న బ్రాండ్‌ ఇమేజ్‌తో ఈ కార్లకు బాగానే అమ్మకాలు సాగాయి.

అయితే ఇటీవల బీజెడ్‌4ఎక్స్‌ వాహనంలో వరుసగా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణం మధ్యలో చక్రాలు ఊడిపోతున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయ్‌. దీంతో వెంటనే టయోటా అప్రమత్తమైంది. ఇబ్బందులు వస్తున్న బీజెడ్‌4ఎక్స్‌ కార్లను వెనక్కి రీకాల్‌ చేయాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 2700 కార్లను రీకాల్‌ చేయనున్నారు. ఇందులో యూరప్‌ 2,200, యూఎస్‌ 260, కెనాడ 10, జపాన్‌ 110 వరకు కార్లు ఉన్నాయి. 

టయోటా ఈవీ కారులో ఇబ్బందులు రావడం ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఇటీవల ఈవీలలో మంటలు చెలరేగడం పరిపాటిగా మారింది. తాజాగా ఇండియాలో టాటా నెక్సస్‌ కారులో మంటలు వ్యాపించాయి. ఇదే సమయంలో టయోటా ఈవీ కారు ఉదంతం తెరపైకి రావడంతో ఎలక్ట్రిక్‌ వాహనాల భద్రతపై సందేహాలు కమ్ముకున్నాయి. అయితే టయోటా విషయంలో సమస్య బ్యాటరీలో కాకుండా చక్రాల దగ్గర కావడంతో సమస్య తీవ్రత తగ్గింది.

చదవండి: షాకింగ్‌ వీడియో: మంటల్లో టాటా నెక్సాన్‌ ఈవీ, స్పందించిన సంస్థ

మరిన్ని వార్తలు