కోవిషీల్డ్‌కు గ్రీన్ పాస్ షాక్‌!  సీరం సీఈవో భరోసా

28 Jun, 2021 12:22 IST|Sakshi

 కోవిషీల్డ్‌కు యూరోపియన్ యూనియన్  దేశాల గ్రీన్ పాస్

త్వరలోనే పరిష్కరిస్తాం : అదర్‌ పూనావాలా

సాక్షి, ముంబై: కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా వ్యాక్సిన్‌ తీసుకున్న ధృవీకరణ పత్రాలను చాలా దేశాలు తప్పనిసరి చేసాయి. అయితే మన దేశంలో తయారైన  కోవీషీల్డ్‌ టీకా తీసుకుని విదేశాలకు పయనం కాబోతున్నవారికి  ఎదురవుతున్న గ్రీన్‌ పాస్‌ ఇబ్బందులపై  శుభవార్త.  కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకుని  ఈయూ దేశాలకు వెళుతున్న విమాన ప్రయాణీకులకు ఇబ్బందులపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా స్పందించారు. కోవీషీల్డ్ కారణంగా ప్రయాణ సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని  పూనావాలా  ట్వీట్ చేశారు.  ఈ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆందోళన అవసరం లేదని హామీ  ఇచ్చారు. (DRDO: 2-డీజీ డ్రగ్‌, కమర్షియల్‌ లాంచ్‌ )

కోవీషీల్డ్‌ టీ​కా తీసుకున్న చాలామంది భారతీయులు ఎదుర్కొంటున్న విదేశీ ప్రయాణ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నానంటూ  భరోసా ఇచ్చారు.  దీనిని ఆయా దేశాల అత్యున్నత అధికారులు, రెగ్యులేటర్లు, దౌత్య  అధికారులతో  చర్చిస్తున్నామని తెలిపారు. దీనికి త్వరలోనే పరిష్కారం లభించనుందని ఆశిస్తున్నట్టు  చెప్పారు. గ్రీన్ పాస్ నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను యూరోపియన్ యూనియన్ మినహాయించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

పూణేకు చెందిన సీరం దేశీయంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ టీకా తీసుకున్న ప్రయాణికులు యూరోపియన్ యూనియన్ (ఈయు) ‘గ్రీన్ పాస్’కు  కోవిడ్-19  వ్యాక్సిన్ల జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం, ఫైజర్‌,  మెడెర్నా, జాన్సన్  అండ్‌ జాన్సన్ , వాక్స్‌ జెర్విరా ఈ నాలుగు టీకాలను యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదించింది.

మరిన్ని వార్తలు