ట్రయంఫ్‌ టైగర్‌ 1200 అడ్వెంచర్‌ బైక్‌ 

25 May, 2022 02:21 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం మోటార్‌సైకిల్స్‌ తయారీలో ఉన్న బ్రిటిష్‌ బ్రాండ్‌ ట్రయంఫ్‌ తాజాగా భారత్‌లో సరికొత్త టైగర్‌ 1200 అడ్వెంచర్‌ బైక్‌ను విడుదల చేసింది. జీటీ ప్రో, ర్యాలీ ప్రో, అలాగే సుదూర ప్రయాణాల కోసం జీటీ ఎక్స్‌ప్లోరర్, ర్యాలీ ఎక్స్‌ప్లోరల్‌ వేరియంట్లలో ఇది లభిస్తుంది.

ధర ఎక్స్‌షోరూంలో రూ.19.19 లక్షల నుంచి ప్రారంభం. టైగర్‌ 1200 చేరికతో అడ్వెంచర్‌ మోటార్‌సైకిల్‌ విభాగంలో 660 నుంచి 1200 సీసీ శ్రేణిలో తొమ్మిది మోడళ్లను కంపెనీ పరిచయం చేసినట్టు అయింది. 

మరిన్ని వార్తలు