ట్రూకాలర్‌లో అదిరిపోయే ఫీచర్.. ఆ మెసేజ్‌లను పసిగట్టేస్తుంది!

22 Apr, 2023 11:26 IST|Sakshi

స్మార్ట్ ఫోన్ కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ (Truecaller) కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఎస్సెమ్మెస్‌ రక్షణ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మోసపూరిత మెసేజ్‌లపై అవగాహన లేని యూజర్లకు ఈ రక్షణ ఫీచర్ ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. 

ట్రూకాలర్‌ అంచనా ప్రకారం 100 మిలియన్లకుపైగా యూజర్లు ఆ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. వారు గత మూడు నెలల్లో కనీసం ఒక మోసపూరిత ఎస్సెమ్మెస్‌ అందుకున్నారు. ఈ మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు ప్రధానంగా విద్యుత్ బిల్లు చెల్లింపులు, బ్యాంకులు, ఉద్యోగ ఆఫర్‌లు, కేవైసీ సంబంధిత, లోన్‌లు, ఛారిటీ, లాటరీ వంటి అంశాలకు సంబంధించినవి వస్తున్నాయి.

ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్‌!

ట్రూకాలర్‌ ప్రవేశపెట్టిన ఈ ఎస్సెమ్మెస్‌ ఫ్రాడ్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్ ఫోన్‌లకు వచ్చే మోసపూరిత సందేశాలను తెలివిగా గుర్తించగలదు. యూజర్ రిపోర్ట్‌లు లేకుండానే ట్రూకాలర్స్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఫ్రాడ్‌ ఎస్సెమ్మెస్‌లను గుర్తిస్తుంది.

కొత్త ఫీచర్‌ ఎలా పనిచేస్తుందంటే..
ట్రూకాలర్‌ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని ఆండ్రాయిడ్‌ వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. యూజర్‌ ఫోన్‌కు మోసపూరిత ఎస్సెమ్మెస్‌ వచ్చినప్పుడు కొత్త ఫీచర్‌ ఆధారంగా ట్రూకాలర్‌ యాప్‌ ఎరుపు రంగు నోటిఫికేషన్ చూపుతుంది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. 

ఈ నోటిఫికేషన్ మాన్యువల్‌గా తీసేసే వరకు స్క్రీన్‌పై ఉంటుంది. ఒకవేళ యాజర్‌ పొరపాటున ఆ ఫ్రాడ్‌ మెసేజ్‌ను ఓపెన్‌ చేసినా అందులోని లింక్‌లను ట్రూకాలర్‌ డిసేబుల్‌ చేస్తుంది. అయితే ఆ మెసేజ్‌ సురక్షితమే అని యూజర్‌ స్పష్టంగా గుర్తించినట్లయితే మాత్రమే ఆ ఎస్సెమ్మెస్‌ను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఇదీ చదవండి: దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ

మరిన్ని వార్తలు