మీరెవరో.. ట్రూకాలర్‌ ఇట్టే చేప్పేస్తుంది!

6 Dec, 2022 17:06 IST|Sakshi

కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ మరో అదిరిపోయే ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ సాయంతో తాము గవర్నమెంట్‌ అధికారులమని, లేదంటే మంత్రి, ఎమ్మెల్యేలం’ అంటూ డబ్బులు వసూలు చేసే కేటుగాళ్ల ఆటకట్టిస్తున్నట్లు తెలిపింది. తాము తెచ్చిన ఈ గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ ఫీచర్‌తో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లను ఈజీగా గుర్తించవచ్చని ట్రూకాలర్‌ ప్రతినిధులు వెల్లడించారు. 

అంతేకాదు బాధితులు సమస్యల్ని నేరుగా అధికారులు, సంబంధిత ఎమ్మెల్యే, ఎంపీలతో చర్చించవచ్చని, ఇందుకోసం గవర్నమెంట్‌ డిజిటల్‌ డైరెక్టరీ ఫీచర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల ఫోన్‌ నెంబర్లు ఉన్నాయని చెబుతోంది. 

తాము ప్రభుత్వ పెద్దలమని సామాన్యుల్ని మోసం చేసే వారిని గుర్తించే  అవకాశం ఏర్పడుతుందని, తద్వారా మోసాల్ని అరికట్టవచ్చని ట్రూకాలర్‌ తెలిపింది. ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే ఆ సమాచారం గవర్నమెంట్‌ డిజిటల్‌ డైరెక్టరీలో సంబంధిత ఫోన్‌ వినియోగదారులకు సమాచారం వెళ‍్తుందని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. యూజర్లు తమ ఫోన్లలో ట్రూకాలర్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసి ఈ ఫీచర్‌ను పొందవచ్చు. 

మరిన్ని వార్తలు