టీవీ టుడే: ఫలితాలు నిరుత్సాహం.. ఒక్కో షేరుకు రూ.67 బంపర్‌ డివిడెండ్‌!

4 Feb, 2023 07:17 IST|Sakshi

న్యూఢిల్లీ: టీవీ టుడే నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 55 శాతం తగ్గి రూ.28 కోట్లకు పరిమితమైంది. ఆదాయం కూడా 10 శాతం తగ్గి రూ.231 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.61 కోట్లు, ఆదాయం రూ.258 కోట్ల చొప్పున ఉన్నాయి.

టెలివిజన్, ఇతర మీడియా కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.229 కోట్లుగా ఉంది. రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ సేవల నుంచి రూ.2.38 కోట్ల ఆదాయం వచ్చింది. వ్యయాలు 12 శాతం పెరిగి రూ.206 కోట్లుగా ఉన్నాయి. ఒక్కో షేరుకు రూ.67 ప్రత్యేక డివిడెండ్‌ కింద ఇవ్వాలని కంపెనీ బోర్డ్‌ నిర్ణయించింది. ఇందుకు ఫిబ్రవరి 13 రికార్డ్‌ తేదీగా ప్రకటించింది.

చదవండి: Google Layoffs: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్‌ ఉద్యోగులు..

మరిన్ని వార్తలు