కొత్త బైక్ కొనేవారికి టీవీఎస్ మోటార్ గుడ్‌న్యూస్‌!

4 Jul, 2021 14:56 IST|Sakshi

మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. టీవీఎస్ మోటార్ ఇండియా అత్యంత ప్రజాదరణ పొందిన అపాచీ ఆర్టీఆర్ 160 4వీపై నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్ను ప్రకటించింది. మీరు అపాచీ బైక్ కొనుగోలు చేసే సమయంలో 3 నుంచి 6 నెలల కాలానికి ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ ఆఫర్ జూలై 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. టీవీఎస్ మోటార్ ఇండియా అందించిన ఈ ఆఫర్ ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డు హోల్డర్లకు మాత్రమే వర్తిస్తుంది. అందువల్ల, ఈ ఆఫర్ పూర్తి వివరాల కోసం మీకు దగ్గరల్లో ఉన్న టీవీఎస్ షో రూమ్ లను సంప్రదించండి.

టీవీఎస్ మోటార్స్ తెలిపిన వివరాల ప్రకారం, మీరు కేవలం రూ.5 వేలు డౌన్ పేమెంట్‌తో అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ బైక్‌ను మీ దగ్గరలోని టీవీఎస్ షో రూమ్, అధికారిక వెబ్ సైట్ కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఎన్ టోర్క్, అపాచే ఆర్టీఆర్ 200 4వీ, స్కూటీ పెప్ ప్లస్, జెస్ట్ కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి 159.7 సీసీ సింగిల్ సిలిండర్, ఫోర్ వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 9,250 ఆర్పీఎమ్ వద్ద 17.39 బిహెచ్ పీ పవర్ అవుట్ పుట్, 7,250 ఆర్ పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్  ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్ లైట్, ట్విన్ డీఆర్ ఎల్ అప్ ఫ్రంట్, ఎల్ ఈడి టెయిల్ ల్యాంప్, ఎబీఎస్, ఫుల్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ(జిటిటీ)తో వస్తుంది. ఈ స్పోర్ట్స్ కమ్యూటర్ మోటార్ సైకిల్ నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, రేసింగ్ రెడ్ కలర్ రంగులలో లభ్యం అవుతుంది.

చదవండి: డీఆర్‌డీఓ డీ-4 డ్రోన్‌ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్

మరిన్ని వార్తలు