2021లో టీవీఎస్​ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల జోరు!

22 Apr, 2021 17:04 IST|Sakshi

మన దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో పోటీ ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. చాలా వరకు పెద్ద కంపెనీలు ఇంకా తమ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని రాలేదు. ఇప్పుడిప్పుడే ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని గణాంకాలు చూస్తే మనకు అర్ధం అవుతుంది. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సాహిస్తున్నాయి. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ రెండూ కూడా తమ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ వాహన మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేశాయి.  

బజాజ్ తన పాత మోడల్ చేతక్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువచ్చింది. బజాజ్ నుంచి ప్రస్తుతానికి ఒకే ఒక్క ఎలక్ట్రిక్ వాహనం అందుబాటులో ఉంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్‌ పేరుతో  ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్లు దాదాపు ఒకే సమయంలో మార్కెట్లో ప్రారంభించబడ్డాయి. ఈ రెండు 2020లో భారత మార్కెట్​లోకి లాంఛ్​ అయ్యాయి. అయితే, వీటి అమ్మకాలు మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

2020-21 ఆర్థిక సంవత్సరంలో బజాజ్ చేతక్​ 1,395 వేల​ అమ్మకాలతో అగ్రస్థానంలో నిలవగా టీవీఎస్ ఐక్యూబ్ 1,110 యూనిట్లను అమ్మేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2021 మార్చిలో టీవీఎస్ ఐక్యూబ్ 355 యూనిట్లను విక్రయించగా, బజాజ్​ చేతక్​ కేవలం 90 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంటే, బజాజ్​ చేతక్​ కంటే టీవీఎస్​ ఐక్యూబ్​ అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. కంపెనీలు ఏడాదికి రెండు వేల ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బజాజ్ కొంచెం వెనుకబడింది అని చెప్పుకోవాలి.

చదవండి: ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు హైదరాబాదీలు

మరిన్ని వార్తలు