స్కూటీ అమ్మకాల్లో టీవీఎస్‌ రికార్డ్‌ !

27 Oct, 2021 08:04 IST|Sakshi

హెదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల హవాలోనూ తన సత్తా చాటింది. ముఖ్యంగా స్కూటీ అమ్మకాలు రికార్డు
స్థాయిలో జరిగాయి. దీంతో స్కూటీ అమ్మకాలు 50 లక్షల యూనిట్లను దాటి కొత్త మైలురాయిని అధిగమించినట్టయ్యింది. 

ఈటీఎఫ్‌ఐ ఎకోథ్రస్ట్‌ టెక్నాలజీతో 87.8 సీసీ ఇంజన్‌తో ఇది తయారైంది. ఫోర్‌ స్ట్రోక్‌ సింగిల్‌ సిలిండర్, 6.5 ఎన్‌ఎం టార్క్, 4 కిలోవాట్‌ పవర్, పేటెంటెడ్‌ ఈజీ స్టాండ్‌ టెక్నాలజీ, టెలిస్కోపిక్‌ సస్పెన్షన్, డీఆర్‌ఎల్‌ ఎల్‌ఈడీ ల్యాంప్స్, 4.2 లీటర్ల సామర్థ్యంతో ఇంధన ట్యాంక్‌ పొందుపరిచారు. అయిదు రంగుల్లో లభిస్తుంది. హైదరాబాద్‌ ఎక్స్‌షోరూంలో ధర మోడల్‌నుబట్టి రూ.56–59 వేల మధ్య ఉంది.
 

మరిన్ని వార్తలు