TVS: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై టీవీఎస్‌ కీలక నిర్ణయం..!

26 Oct, 2021 15:46 IST|Sakshi

ప్రముఖ టూవీలర్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టీవీఎస్‌ మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కోసం ఏకంగా కొత్త కంపెనీను సెటప్‌ చేయాలని టీవీఎస్‌ మోటార్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ టీవీఎస్‌ మోటార్స్‌కు అనుబంధ సంస్థగా పనిచేయనుంది. ఈ కంపెనీ ద్వారా ఈవీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు..పలు కొత్త ఈవీ ప్రొడక్ట్స్‌ లాంచ్‌, డెవలమెంట్‌ అండ్‌ విస్తరణకు నిలయంగా ఉంటుందని టీవీఎస్‌ భావిస్తోంది.  
చదవండి: ఈ ఎగిరే ఎలక్ట్రిక్ కారు ధర మరి ఇంత తక్కువ!

టూవీలర్, త్రీవీలర్ పరిశ్రమల కోసం వివిధ ఈవీ కాన్సెప్ట్‌లపై సుమారు 500కు పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారని టీవీఎస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈవీ టెక్నాలజీ కోసం భవిష్యత్తులో రూ. 300 కోట్ల వరకు ఖర్చు చేయాలని టీవీఎస్‌ యోచిస్తోంది. కంపెనీ ఇటీవలే స్విట్జర్లాండ్‌కు చెందిన ఈవీ కంపెనీ  ఇగో మూవ్‌మెంట్‌లో మెజారిటీ వాటాను టీవీఎస్‌ కొనుగోలు చేసింది.  

టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల్లో భాగంగా టీవీఎస్‌ ఐక్యూబ్ ఈ-స్కూటర్‌ను భారత్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎంపిక చేసిన నగరాల్లోనే కొనుగోలుదారులకు  అందుబాటులో ఉంది.
చదవండి: TVS Motor: అదరగొట్టిన టీవీఎస్‌ మోటార్స్‌..!

  

>
మరిన్ని వార్తలు