మళ్లీ ఐపీవోకు టీవీఎస్‌ సప్లై చైన్‌

4 May, 2023 04:35 IST|Sakshi

సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ దాఖలు

న్యూఢిల్లీ: టీవీఎస్‌ మొబిలిటీ గ్రూప్‌ కంపెనీ టీవీఎస్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ మరోసారి పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయడంతోపాటు.. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 2 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.

కంపెనీ ఇంతక్రితం 2022 ఫిబ్రవరిలో ప్రాథమిక పత్రాలను దాఖలు చేయడం ద్వారా సెబీ నుంచి అదే ఏడాది మే నెలలో లిస్టింగ్‌కు అనుమతి పొందింది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. అయితే మార్కెట్‌ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఐపీవో యోచనకు స్వస్తి పలికింది. నిబంధనల ప్రకారం అనుమతి పొందాక గడువు(ఏడాది)లోగా పబ్లిక్‌ ఇష్యూ చేపట్టకుంటే తిరిగి తాజాగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

మరిన్ని వార్తలు