'ఎలన్‌ మస్క్‌.. మొత్తానికి అనుకున్నది సాధించాడు'

20 Jun, 2022 16:22 IST|Sakshi

బిజినెస్‌ టైకూన్‌ ఎలన్‌ మస్క్‌ మొత్తానికి అనుకున్నది సాధించాడు. ఎంపిక యూజర్లకు ట్విటర్‌ ఎడిట్‌ బటన్‌ అందుబాటులోకి తెచ్చేలా చేశారు. ప్రస్తుతం ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ.. మస్క్‌ కోరుకున్నట్లు ట్విటర్‌ ఎడిట్‌ బటన్‌ అందుబాటులోకి రావడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

యూజర్లందరికి ఎడిటన్‌ బటన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ట్విటర్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అయితే ఈ తరుణంలో ట్విటర్‌ సెలెక్టెడ్‌ యూజర్లకు ఎడిట్‌ బటన్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఫిల్టర్‌ ఫీచర్‌ సాయంతో అసభ్య పదజాలంతో చేసిన ట్విట్‌లను డిలీట్‌ చేస్తుందని, ఎడిట్‌ బటన్‌ ఆప్షన్‌ అందుబాటులోకి తెచ్చిందని ముకుల్‌ శర్మ అనే టెక్నాలజీ క్రియేటర్‌ ట్వీట్‌ చేశాడు. 

ఎడిటన్‌ బటన్‌ ఆప్షన్‌తో 
గతంలో అభ్యంతరకరమైన ట్వీట్‌లు చేస్తే డిలీట్‌ చేయడం తప్పా వేరే దారి లేదు. కానీ ఎడిట్‌ బటన్‌ ఆప్షన్‌ సాయంతో యూజర్లు అభ్యంతరకరమైన ట్వీట్ చేస్తే.. వాటిని ఎడిట్‌ చేయోచ్చు, లేదంటే డిలీట్‌ చేయోచ్చు. ఇక ఈ ఆప్షన్ కోసం మస్క్‌ కొంత కాలం ట్విటర్‌తో ఫైట్‌ చేసి.. చివరికి ఆ సంస్థను కొనుగోలు చేశారు.  

విమర్శల వెల్లువ 
ట్విటర్‌ వాక్‌ స్వాతంత్రపు విధానాలకు కట్టుబడి లేదంటే గతంలో మస్క్‌ ఆ సంస్థపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శల పరంపరను కొనసాగిస్తూ ఏప్రిల్‌ 5న ట్విటర్‌లో మీకు ఎడిట్‌ బటన్‌ కావాలా అంటూ పోల్‌ పెట్టాడు. ఆ పోల్‌ దెబ్బకు ఆ సంస్థ పునాదుల్ని కదిలేలా చేశాయి. ట్విటర్‌ను తానే 44 బిలియన్లకు కొనుగోలు చేస్తున్నట్టు మస్క్‌ ప్రకటించాడు. కానీ అంతలోనే ట్విటర్‌లో ఫేక్‌ అకౌంట్‌లపై సంస్థ క్లారిటీ ఇవ్వాల్సిందేనని ట్విస్ట్‌ ఇచ్చాడు.

ఎంతో దూరం లేదు
ఎలన్‌ మస్క్‌ ప్రకటనతో ఆయన ట్విటర్‌ కొనుగోలు అంశం ఆగినట‍్లే ఆగి..మళ్లీ మొదలైంది. ఇటీవల మస్క్‌ ట్విటర్‌ ఉద్యోగులతో సంభాషించాడు. సంస్థలో ఉద్యోగులకు స్వేచ్ఛ ఉంటుందని హామీ ఇచ్చాడు. ఆర్ధికంగా ఎదిగేందుకు ఖర్చుల‍్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఇక టెస్లా మాదిరిగా ట్విటర్‌ ఉద్యోగుల తొలగింపు ఉంటుందా అనే అంశంపై దాటవేశాడు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ట్విటర్‌ ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులోకి తేవడం.. మస్క్‌ ట్విటర్‌ను పూర్తి స్థాయిలో దక్కించుకోవడం ఎంతో దూరంలో లేదని మస్క్‌ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి👉మాయదారి ట్విటర్‌..కరిగిపోతున్న మస్క్‌ సంపద!

మరిన్ని వార్తలు