మళ్లీ మొదటికి వచ్చిన ట్విటర్.. గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నాన్ లోక‌ల్‌..!

28 Jun, 2021 16:06 IST|Sakshi

కేంద్రం, ట్విటర్ మధ్య ఉద్రిక్తలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఐటీ శాఖ మంత్రి ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసి తిరిగి పునరుద్దరించిన కొద్ది రోజులోకే ట్విటర్ ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ పోస్టు నుంచి ధర్మేంద్ర చాతుర్‌ ఆ పదవికి రాజీనామా చేశారు. జూన్ 9న ట్విటర్, సోషల్ మీడియా సంస్థలకు సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలను పాటించనునట్లు ప్రభుత్వానికి లేఖ రాసింది. కొత్త ఐటీ నిబందనల ప్రకారం భారత్‌లో ట్విట్టర్‌ వినియోగదారుల పీర్యాదుల కోసం మన దేశానికి చెందిన వారినే గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా నియమించాలని కొత్త ఐటీ నిబంధనలు చెబుతున్నాయి. 

దీంతో ఇటీవల ట్విట్టర్‌ సంస్థ ధర్మేంద్ర చాతుర్‌ని గ్రీవెన్స్‌ అధికారిగా నియమించింది. ధర్మేంద్ర ఆ పదవికి రాజీనామా చేయడంతో కొత్తగా ఆయన స్థానంలోకి ట్విటర్ గ్లోబల్ లీగల్ పాలసీ డైరెక్టర్ అయిన జెరెమి కెస్సెల్‌ను భారతదేశానికి గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. ఇండియాలో కొత్ ఐటీ రూల్స్‌ను పాటిస్తూ ఈ ఆఫీసర్‌ను నియమించింది. అయితే నిబందనల ప్రకారం స్థానికులనే గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియాయమించాలి. ఇప్పుడు ఆ నిబందనలు ఉల్లఘించడంతో ఈ నియామకాన్ని భారత ప్రభుత్వం అంగీకరించట్లేదు. కొత్త ఐటీ గైడ్‌లైన్స్ ప్రకారం 50 లక్షల కన్నా ఎక్కువ యూజర్లు కలిగి ఉన్న సోషల్ మీడియా సంస్థలో పబ్లిష్ అయ్యే కంటెంట్‌కు సదరు సంస్థల్ని బాధ్యుల్ని చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. 

చదవండి: ట్విట్టర్‌కు గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ ‘గుడ్‌ బై’

మరిన్ని వార్తలు