ElonMusk బ్లూటిక్‌ బాదుడు పక్కా,ముహూర్తం ఫిక్స్‌

16 Nov, 2022 11:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్విటర్‌ బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ బాదుడుపై ట్విటర్‌ కొత్తబాస్‌, బిలీయనీర్‌  ఎలాన్‌ మస్క్‌   క్లారిటీ ఇచ్చారు.  ఈ నెలాఖరునుంచి (నవంబరు 29)  బ్లూటిక్‌  వెరిఫికేషన్‌ ఫీజు మొదలవుతుందని మస్క్‌  ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.  (ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?)

తాత్కాలికంగా నిలిపివేసిన బ్లూ చెక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ నవంబర్ 29న పునఃప్రారంభిస్తున్నట్టు  మస్క్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు.  ఇది మాత్రం పక్కా అంటూ  తేల్చి చెప్పేశారు. అంతేకాదు తమ సర్వీసు నిబంధనలకు అనుగుణంగా ట్విటర్‌ ధృవీకరించని ఖాతాలు పేరు మార్చుకుంటే బ్లూటిక్‌ కోల్పోతారని కూడా తెలిపారు.

కాగా 44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న టెస్లా చీఫ్‌ మస్క్‌ నెలకు 8 డాలర్ల బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్ ప్రకటించారు. అయితే నకిలీ ఖాతాల బెడద కారణంగా బ్లూటిక్  వెరిఫికేషన్‌  ఫీజు అమలు నిర్ణయాన్ని  తాత్కాలికంగా బ్రేక్‌ వేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు