మీకు ట్విటర్‌ పేరడీ అకౌంట్స్‌ ఉన్నాయా? నా సలహా ఇదే

13 Nov, 2022 11:17 IST|Sakshi

 ‘బ్లూటిక్‌’ సబ్‌స్క్రిప్షన్‌ పునరుద్ధరించే అంశంపై ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. నెలకు 8 డాలర్లు చెల్లిస్తే ఎవరికైనా బ్లూట్‌ టిక్‌ వెరిఫికేషన్‌ను బ్యాడ్జీని అందిస్తామని కొద్ది రోజుల క్రితం మస్క్‌ ప్రకటించారు. కొన్ని దేశాల్లో ట్విటర్‌ బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ప్రారంభించారు. 

ఫలితంగా వారం రోజుల వ్యవధిలో పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను వాయిదా వేస్తున్నట్లు మస్క్‌ తెలిపారు. ఒరిజనల్‌ సంస్థలు, వ్యక్తుల పేర్లమీద కొంతమంది ఫేక్‌ అకౌంట్‌లు క్రియేట్‌ చేస్తున్నారని, వాటి వల్ల ఏ అకౌంట్‌ ఒరిజినల్‌, ఏ అకౌంట్‌ డూప్లికేట్‌ అనేది గుర్తించడం కష్టంగా మారింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  

తాజాగా బ్లూటిక్‌పై  పాల్‌ జమిల్‌ అనే యూజర్‌ అడిగిన ప్రశ్నకు మస్క్‌ రిప్లయి ఇచ్చారు. వారం రోజుల్లోగా బ్లూటిక్‌ సేవల్ని పునరుద్దరిస్తామని చెప్పారు. అంతేకాదు ప్రముఖుల, పాపులర్‌ పేర్లతో పేరడీ అకౌంట్లు క్రియేట్‌ చేసి..కంటెంట్‌ పోస్ట్‌ చేసేవాళ్లకు సలహా ఇచ్చారు. పేరడీ ట్విటర్‌ అకౌంట్‌లు ఉన్న వారు.. బయోలో కాకుండా యూజర్‌ నేమ్‌లో పేరడీ అనే పదాన్ని జత చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు