ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి వైదొలగునున్న జాక్ డోర్స్, నిజమెంత?

29 Nov, 2021 20:53 IST|Sakshi

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాక్ డోర్సే పదవి నుంచి వైదొలగాలని చూస్తున్నట్లు సీఎన్‌బీసీ నివేదించింది. అయితే, ఈ విషయంపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు. నవంబర్ 28న తన చివరి ట్వీట్లో డోర్సే "ఐ లవ్ ట్విటర్" అని పేర్కొన్నారు. 2020 ప్రారంభంలో ట్విట్టర్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలగాలని ట్విట్టర్ వాటాదారు ఇలియట్ మేనేజ్ మెంట్ కార్ప్ నుంచి విమర్శలు వచ్చాయి. డోర్సే ఎందుకు వైదొలగాలని అనుకుంటున్నారో కూడా ఎవరికీ తెలియదు.

అలాగే అతను దిగిపోతే తదుపరి సీఈఓగా ఎవరు కొనసాగుతారు అనే విషయంపై కూడా స్పష్టత లేదు. ఈ ఏడాది ప్రారంభంలో 2023 చివరి నాటికి 315 మిలియన్ మానిటబుల్ రోజువారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉండాలని, అలాగే కనీసం కంపెనీ వార్షిక ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. ‎ట్విట్టర్ ను జాక్ ‎‎డోర్సే,‎‎ ‎‎నోహ్ గ్లాస్,‎‎ ‎‎బిజ్ స్టోన్,‎‎ ‎‎ఇవాన్ విలియమ్స్ కలిసి‎‎ జూలై 2006లో ప్రారంభించారు. మాజీ సీఈఓ 2015లో డిక్ కోస్టోలో పదవీ విరమణ చేసిన తర్వాత జాక్ డోర్స్ ట్విట్టర్ సీఈఓ భాద్యతలు చేపట్టాడు.

(చదవండి: డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!)

మరిన్ని వార్తలు