Anand Mahindra : మీరు అడగటమే ఆలస్యం.. మా వాళ్లు వచ్చేస్తారు !

19 Mar, 2022 18:19 IST|Sakshi

సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ప్రజల మధ్య గ్యాప్‌ తగ్గిపోయింది. సామాన్యులు, సెలబ్రిటీలు ఒకే వేదిక మీద చర్చించుకుంటున్నారు. ఇక సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా లాంటి వ్యక్తులకయితే మరీ బిజీ. మొన్న సినీ దర్శకుడు నాగ్‌అశ్విన్‌ సాయం కోరగా నిన్న ముంబై కమిషనర్‌ సంజయ్‌పాండే మహీంద్రా హెల్ప్‌ అడిగాడు. కారణం మంచిదైతే సాయం చేయడంలో తగ్గేదేలే అంటున్నాడు ఆనంద్‌ మహీంద్రా.

ముంబై మహానగరంలో రోడ్లపై చాలా చోట్ల పాడైన వాహనాలు, ఉపయోగించని వాహనాలు ఉండిపోయాయి. ఏళ్ల తరబడి ఈ వాహనాలు రోడ్లపై ఉంటున్నా.. ఎవరూ దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. తాజాగా బృహన్‌ ముంబై కమిషనర్‌ రిమూవ్‌ కటారా పేరుతో పాత వాహానాల తొలగింపు పనులు చేపడుతున్నారు. మొదటి రోజే ఇలాంటివి 358 వాహనాలను తొలగించారు. ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. దీంతో మూవ్‌కటారా మూవ్‌మెంట్‌కి హెల్ప్‌ చేయాలంటూ మహీంద్రారైజ్‌, టాటా కంపెనీలు బీఎంసీ కమిషనర్‌ సంజయ్‌పాండే 2022 మార్చి 18న కోరారు.

సంజయ్‌ పాండే రిక్వెస్ట్‌కి సానుకూలంగా స్పందించారు ఆనంద్‌ మహీంద్రా. ముంబైకి మంచి పనులు చేయడంలో మీరు ఏమాత్రం ఆలస్యం చేయోద్దు. అదే విధంగా మీరు అడిగిన సాయం అందివ్వడంలో మా తరఫున కూడా ఎటువంటి ఆలస్యం జరగదు. మహీంద్రా ట్రక్‌బస్‌ టీమ్‌ మీతో టచ్‌లోకి వస్తారంటూ మరుసటి రోజు బదులిచ్చారు ఆనంద్‌ మహీంద్రా. 

చదవండి: నాగ్‌ అశ్విన్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

మరిన్ని వార్తలు