Twitter down: యూజర్లకు లాగిన్‌ సమస్యలు, ఏమైంది అసలు?

4 Nov, 2022 10:24 IST|Sakshi

సాక్షి, ముంబై: మైక్రో-బ్లాగింగ్ వెబ్‌సైట్‌ ట్విటర్‌లో లాగిన్‌ సమస్య యూజర్లను అయోమయానికి గురిచేసింది. శుక్రవారం  ఉదయం  ట్విటర్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. చాలామంది  యూజర్లను లాగిన్‌ సమస్య ఇబ్బంది పెట్టింది. యూజర్లు లాగిన్‌ అవుతోన్న సందర్భంలో ఎర్రర్‌ మెసేజ్‌ దర్శనమివ్వడంతో అసౌకర్యానికి గురయ్యారు. అయితే  మొబైల్‌  యూజర్లకు ట్విటర్‌లాగిన్‌లో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు.  

డెస్క్‌టాప్‌ యూజర్లకు ‘సమ్‌థింగ్‌ వెంట్ రాంగ్‌’ అనే ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తోంది. కొత్త ఫీచర్‌ మార్పులు కారణంగా సమస్య ఏర్పడుతోందా, అందుకోసమే  డౌన్‌టైమ్ ప్లాన్  చేశారా అనేది  క్లారిటీ లేదు. అయితే ఏ మేరకు  ప్రభావితమైంది?, సమస్యకు గల కారణం ఏంటి అనే దానిపై  సంస్థ నుంచి  ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  

కాగా ఇటీల సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సాప్‌ సేవలు  ప్రపంచవ్యాప్తంగా నిలిచి పోవడం పెద్ద కలకలమే రేపింది. గత వారం ట్విటర్‌ను ప్రపంచ బిలియనీర్‌ ఎలాన్‌  మస్క్‌ టేకోవర్‌ చేశారు. మరుక్షణం నుంచి భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన మస్క్‌ కీలక ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన పలికారు. దాదాపు సగానికిపైగా సంస్థ ఉద్యోగుల  తొలగింపు ప్రణాళికల్లో ఉన్నారన్న నివేదికలు ఆందోళన రేపాయి. ముఖ్యంగా ఈ రోజునుంచే  ఈ తొలగింపులను ప్రారంభించ నుందని అంచనా. 

మరిన్ని వార్తలు