ట్విటర్ నుంచి నన్ను ఎందుకు తొలగించారన్న ఉద్యోగి.. ఎలాన్ మస్క్ రిప్లై ఇలా

7 Mar, 2023 14:39 IST|Sakshi

గత కొన్ని రోజులుగా గూగుల్, పేస్‌బుక్‌, ట్విటర్ వంటి బడా సంస్థలు  ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఒక ట్విటర్ ఉద్యోగి తనను ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించారనే ప్రశ్నకు ఎలాన్ మస్క్ ట్విటర్ ద్వారా ఇచ్చిన రీప్లే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్విట్టర్ మాజీ ఉద్యోగి 'ఇయంహరల్దూర్' తొమ్మిది రోజుల క్రితం 200 మంది ఉద్యోగులతోపాటు నా వర్క్ కంప్యూటర్‌కు యాక్సెస్ కట్ చేశారని, అయితే నేను కంపెనీలో ఉద్యోగినా, కాదా అనేదానికి హెచ్‌ఆర్ హెడ్ ఏవిధంగానూ నిర్దారించలేకపోయారు. నా ఇమెయిల్‌లకు కూడా ఎటువంటి సమాధానం రాలేదని పేర్కొన్నాడు.

ట్విటర్ ఉద్యోగి ప్రశ్నకు సమాధానంగా మస్క్ రిప్లై ఇస్తూ మీరు ఏమి పని చేస్తున్నారని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నేను గోప్యతను ఉల్లంఘించవలసి ఉంటుందని, నేను అలా చేయగలనని మీ న్యాయవాదులు వ్రాతపూర్వకంగా పంచుకుంటే, దానిని బహిరంగంగా చర్చించడానికి సంతోషిస్తానని ట్విటర్ ఉద్యోగి అన్నారు. దీనికి 'ఇది ఆమోదించబడింది, మీరు ముందుకు సాగండి' అని మస్క్ బదులిచ్చారు.

మరిన్ని వార్తలు