‘ఎలాన్‌ మస్క్‌కు ఊహించని షాక్‌’..ట్విట్టర్‌ ఉద్యోగుల వార్నింగ్‌

25 Oct, 2022 15:43 IST|Sakshi

ఎలాన్‌ మస్క్‌- ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పొందం గడువు దగ్గర పడుతున్న వేళ తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే? మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తే ఆ సంస్థకు చెందిన 75 శాతం మంది ఉద్యోగులపై వేటు పడనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో మస్క్‌కు ట్విట్టర్‌ ఉద్యోగులు వార్నింగ్‌ ఇచ్చారు.   

డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీ ఎలాన్‌ మస్క్‌కు డెడ్‌లైన్‌ విధించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 28 సాయంత్రం 5 గంటల లోపు మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని తీర్పిచ్చింది. దీంతో ట్విట్టర్‌ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మస్క్‌ బాస్‌ అయితే తమ ఉద్యోగాలు ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు.  

ఈ నేపథ్యంలో మస్క్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ ట్విట్టర్‌ ఉద్యోగులు యాజమాన్యానికి బహిరంగంగా లేఖ రాశారు. టైమ్‌ నివేదిక ప్రకారం..కొనుగోలు డీల్‌ శుక్రవారంతో ముగియనుండగా..తొలగింపుల్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.‘మస్క్‌ నిర్ణయం అనాలోచితమైంది. నిర్లక్ష్యమైంది. యూజర్లను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. కస్టమర్లు తమ ప్లాట్‌ఫామ్‌పై పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లుతుంది. వేధింపులు, బెదిరింపులు లాంటి వాతావరణంలో మేం పనిచేయలేం’ అని లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు పలు డిమాండ్లను సంస్థ ముందుంచారు. 

చదవండి👉 ‘అదానీ సంపద హాంఫట్‌’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం
 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగించడంతో పాటు ఉద్యోగులకు ఇతర ప్రయోజనాల్ని కొనసాగించాలని తెలిపారు. సిద్ధాంత పరంగా ట్విట్టర్‌కు మస్క్‌ల మధ్య అంతరాయం ఉంది.‘యాజమాన్యం ఉద్యోగుల పట్ల వారి జాతి, లింగం, వైకల్యం, రాజకీయ విశ్వాసాల ఆధారంగా వివక్ష చూపకూడదని మేము కోరుతున్నాము’ అని లేఖలో తెలిపారు. 

ఎలాన్‌ మస్క్‌కు నష్టమే 
ట్విట్టర్‌ ఉద్యోగులపై వేటు మస్క్‌కు నష్టమే తప్పా లాభం లేదని  వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అంతేకాదు కంపెనీ ఎవరి యాజమాన్యంలో ఉన్నా రాబోయే నెలల్లో ఉద్యోగాల కోత ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పింది. ఇక ఉద్యోగులపై మాస్‌ లే ఆఫ్స్‌ నిస్సందేహంగా ట్విట్టర్‌ రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయని, అందులో హానికరమైన కంటెంట్‌ను నియంత్రించే సామర్థ్యం, భద్రతా సమస్యలను ఎదుర్కోవడం వంటి వాటిపై ప్రభావం చూపుతుందని వాషింగ్టన్‌ నివేదిక హైలెట్‌ చేసింది.  

చదవండి👉 ‘ఎలాన్‌ మస్క్‌ స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది’..విడుదల ఎప్పుడు, ధర ఎంత!

మరిన్ని వార్తలు