ట్విటర్‌పై బాంబ్ పేల్చిన విజిల్‌ బ్లోయర్‌!

25 Jan, 2023 12:42 IST|Sakshi

సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌పై విజిల్‌ బ్లోయర్‌ బాంబు పేల్చారు. ట్విటర్‌లో అనేక సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని హెచ్చరించారు. ఇదే విషయంపై కాంగ్రెస్‌ సభ్యులు, ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌తో సంప్రదింపులు జరపడంతో ఇప్పుడీ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. విజిల్‌ బ్లోయర్‌ ఎంట్రీతో మస్క్‌ కంపెనీలో తన పంథా మార్చుకుంటారా? లేదంటే అలాగే కొనసాగుతారా? అనేది తెలియాల్సి ఉంది. 

కాంగ్రెస్‌, ఎఫ్‌టీసీతో జరిపిన చర్చల్లో విజిల్‌ బ్లోయర్‌ ట్విటర్‌లోని సెక్యూరిటీ లోపాల్ని ఎత్తిచూపినట్లు వాషింగ్టన్ పోస్ట్‌ తెలిపింది. ముఖ్యంగా ‘గాడ్‌మోడ్‌’ తో ట్విటర్‌కు చెందిన ఇంజినీర్లు ప్రపంచంలో ఎవరి ట్విటర్‌ అకౌంట్‌లోనైనా లాగిన్‌ అవ్వొచ్చు. ట్వీట్‌ చేయొచ్చు.

ఎలాన్‌ మస్క్‌ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గాడ్‌ మోడ్‌ను కాస్త ప్రివిలేజ్‌డ్‌మోడ్‌గా మార్చారు. పేర్లు మారాయే తప్పా.. భద్రత విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని ఆరోపించారు. అంతేకాదు ట్విటర్‌ ఉద్యోగులు(అందరు కాదు) సులభంగా కోడ్‌లో ఫాల్స్‌ టూ ట్రూ అనే ఆప్షన్‌ మార్చితే ట్వీట్‌లు చేయొచ్చని అన్నారు.

ప్రోగ్రామ్ పేరు మార్చనప్పటికీ.. యూజర్ల అకౌంట్స్‌ను యాక్సిస్‌ చేసేందుకు టెస్ట్‌ చేసే ప్రొడక్షన్‌ కంప్యూటర్‌, శాంపిల్‌ కోడ్‌ ఉంటే సరిపోతుందని విజిల్‌బ్లోయర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వాషింగ్టన్ పోస్ట్‌ కథనంలో హైలెట్‌ చేసింది.

మరిన్ని వార్తలు :

Advertisement
మరిన్ని వార్తలు