మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌కి షాక్ మీద షాక్ తగులుతోంది. ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించారంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది. చేసిన తప్పులకు జరిమానాగా 150 మిలియన్ డాలర్లు (రూ. 1,163 కోట్లు) ఫైన్ కట్టాలంటూ తీర్పు ఇచ్చింది.
ట్విటర్ సంస్థ 2013 మే నుంచి 2019 సెప్టెంబరు మధ్యలో ట్విటర్ యూజర్లకు సంబంధించిన ఫోన్ నంబరు ఇతర కీలక సమాచారాన్ని అడ్వెర్‌టైజర్లకు ఇచ్చిందనే ఆరోపణల మీద యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ)లు విచారణ చేపట్టాయి. సుదీర్ఘ కాలం కొనసాగిన విచారణ అనంతరం యూజర్ల డేటా ప్రైవసీ కాపాడటంతో ట్విటర్ విఫలమైనట్టుగా తేల్చాయి. దీంతో 150 మిలియన్ డాలర్లు ఫైన్‌గా విధించింది.
కోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామని, అదే విధంగా యూజర్ల డేటా సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో న్యాయస్థానం చేసిన సూచనలకు తప్పకుండా పాటిస్తామని ట్విటర్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియేన్ కైరన్ తెలిపారు. గతంలో ప్రైవసీ హక్కుల ఉల్లంఘన విషయంలో ఫేస్‌బుక్ 2019లో 5 బిలియన్ డాలర్లను జరిమానాగా చెల్లించింది.
చదవండి: గుడ్‌బై ట్విటర్.. ఇక సెలవు..