ఆగని తొలగింపుల పర్వం.. ట్విటర్ నుంచి మరో 200 మంది

27 Feb, 2023 11:46 IST|Sakshi

ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ట్విటర్ సంస్థ మరో సారి ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఈ కంపెనీ సారి మరో 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఇందులో ప్రోడక్ట్ మేనేజర్లు, డేటా సైంటిస్టులు, ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం.

కంపెనీ ఈ తొలగింపులు గురించి అధికారిక సమాచారం వెల్లడించలేదు, కానీ ట్విట్టర్ బ్లూ ఇన్‍చార్జ్‌గా ఉన్న ఎస్తేర్ క్రాఫోర్డ్ పేరు కూడా తొలగించిన ఉద్యోగుల జాబితాలో ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ట్విటర్ సంస్థలో 2,300 మంది ఉద్యోగులు ఉన్నారని గత నెలలో ఎలాన్ మస్క్ తెలిపారు.

తాజా నివేదికల ప్రకారం, 200 మంది తొలగింపు నిజమయితే ఎలాన్ మాస్క్ ప్రకటించిన సంఖ్య ఇంకా తగ్గుతుంది. గత ఏడాది నవంబర్ నెలలో ఏకంగా 3,700 మంది ఉద్యోగులను తొలగించారు. ఆ సమయంలో, కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, కంపెనీ ఎదుర్కొనే నష్టాలను కూడా అదుపు చేయడానికి ఉద్యోగులను తొలగించినట్లు మస్క్ ప్రకటించారు.

(ఇదీ చదవండి: తగ్గని డిమాండ్, పెరుగుతున్న బుకింగ్స్.. అట్లుంటది 'గ్రాండ్ విటారా' అంటే!)

గత ఏడాది నుంచి ఉద్యోగులను తొలగిస్తున్న ఎలాన్ మస్క్ కొన్ని సార్లు ఇక ఉద్యోగుల తొలగింపు ఉండదని తెలిపారు. అయితే అది నిజం కాదని ఇప్పుడు స్పష్టమైంది. ఇప్పటికే ఉద్యోగులను తొలగించిన జాబితాలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఉద్యోగులను తొలగించిన కంపెనీలలో టెక్ కంపెనీలు ఎక్కువగా ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు