చిక్కుల్లో ట్విటర్‌: వారు గుడ్‌బై, ఆదాయం ఢమాల్‌..రీజన్‌?

26 Oct, 2022 16:22 IST|Sakshi

న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ భారీగా  యాక్టివ్‌ యూజర్లను పెద్దమొత్తంలో కోల్పోతోందట.  ట్విటర్‌  ఇంటర్నెల్‌ రీసెర్చ్‌ ప్రకారం ట్విటర్‌ గ్లోబల్‌ ఆదాయంలో కీలక భూమిక పోషిస్తున్న 10 శాతం హెవీ ట్వీటర్లు ట్విటర్‌ను వీడుతున్నారట.  ఈ మేరకు  రాయిటర్స్‌ ట్విటర్‌లో ఒక రిపోర్ట్‌ను పోస్ట్‌ చేసింది.

హెవీ ట్వీటర్లు అంటే ఎవరు?
రాయిటర్స్ నివేదిక ప్రకారం తనవ్యాపారంలో కీలకమైన సెలబ్రిటీలు, అత్యంత చురుకైన వినియోగ దారులను నిలబెట్టుకోవడానికి కష్టాలు పడుతోంది. వారానికి ఆరు లేదా ఏడు రోజులు ట్విట్టర్‌లోకి లాగిన్ అయి వారానికి మూడు నుండి నాలుగు సార్లు ట్వీట్ చేసే వ్యక్తిని "హెవీ ట్వీటర్" గా పిలుస్తారు.  వీరి సంఖ్య నెలవారీ మొత్తం వినియోగదారులలో 10శాతం కంటే తక్కువే అయినా ప్రపంచ ఆదాయంలో సగం సృష్టిస్తున్నారని రాయిటర్స్ నివేదించింది. ఇంగ్లీష్ మాట్లాడే ఎక్కువ  యూజర్లలో క్రిప్టోకరెన్సీ, అశ్లీలతతో కూడిన కంటెంట్‌పై ఆసక్తి బాగా పెరిగిందని తెలిపింది. అదే సమయంలో వార్తలు, క్రీడలు, వినోదంపై ఆసక్తి తగ్గుతోందని పేర్కొంది.  (ట్విటర్‌ డీల్‌: మస్క్‌ మరోసారి సంచలన నిర్ణయం!)

కాగా  టెస్లా సీఈవో ట్వీటర్‌ డీల్‌ ను రద్దు చేసుకోవడంతో, షేర్‌ ధర పడిపోవడం, భారీ సంఖ్యలో  యూజర్లను కోల్పోవడం, న్యాయపోరాటం లాంటి ఇబ్బందుల్లో ఉన్న సంస్థకు దీంతో  ఆదాయాన్ని  తెచ్చిపెట్టే యూజర్లను కోల్పోవడం  మరో సమస్య  కానుంది. 

ఇదీ చదవండి :  ఇండోనేషియా కొత్త వీసా: ‘సెకండ్‌ హోం’ అక్కడే పదేళ్లు పండగ!

మరిన్ని వార్తలు