మరోసారి ట్విటర్‌ సర్వర్‌ డౌన్‌.. షాకింగ్‌  లిమిట్స్‌ తెలుసా?

9 Feb, 2023 11:50 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ట్విటర్‌ సర్వర్‌ మరోసారి డౌన్‌ అయ్యింది. దీంతో  వినియోగదారులు తమ అకౌంట్లను లాగిన్‌ చేయలేక ఇబ్బందులు పడ్డారు.  అంతేకాదు ట్వీట్‌ డెక్‌ సైతం పని చేయలేదంటూ సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేశారు. 

బుధవారం రాత్రి మైక్రోబ్లాగింగ్ సైట్‌లో పలు సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ట్వీట్ చేయలేక పోవడం, ప్రత్యక్ష సందేశాలు పంపడం లేదా ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఖాతాలను అనుసరించడం వంటివి చేయలేకపోయారు. కొత్త ట్వీట్‌లను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వినియోగ దారులు "మీరు ట్వీట్‌లను పంపడానికి రోజువారీ పరిమితిని మించిపోయారు" అని పాప్-అప్ సందేశం రావడం గందరగోళానికి దారి తీసింది. 

ట్విటర్‌ కొత్త లిమిట్స్‌ 
- రోజుకు 2,400 ట్వీట్లు
- రోజుకు 500 ప్రత్యక్ష సందేశాలు (డైరెక్ట్‌ మెసేజెస్‌)
- కేవలం 5,000 ఫాలోవర్లకు అనుమతి
- రోజుకు 400 కొత్త ఖాతాల ఫాలోయింగ్‌కు అనుమతి 

బిలియనీర్‌, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ట్విటర్‌ కొత్త నిబంధనల ప్రకారం వ్యక్తిగత , వ్యాపార ఖాతాలను ఆపరేట్ చేసే వినియోగదారులు "ట్వీట్లు పంపడానికి రోజువారీ పరిమితిని" ఉంటుంది. హెల్ప్ పేజీ సైట్  సమాచారం ప్రకారం ట్విటర్‌  కొంత ఒత్తిడిని తగ్గించడానికి,సర్వర్‌ డౌన్‌,  ఎర్రర్ పేజీలను తగ్గింపు ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

బ్లూ టిక్‌ బాదుడు షురూ: భారతదేశంలో ట్విటర్‌ బ్లూ ప్లాన్‌ లాంచ్‌ చేసింది.  ఇండియా యూజర్లు నెలకు బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ రూ.900 ప్రారంభం.

కాగా ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు తరువాత గతేడాదిలో పలుమార్లు సర్వర్‌ డౌన్‌, సాంకేతిక సమస్యలతో యూజర్లు ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు