ఎలన్‌ మస్క్‌ మాయ.. అడుగుపెట్టాడో లేదో ట్విటర్‌పై కాసులవర్షం..! 

4 Apr, 2022 19:22 IST|Sakshi

ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ ఫౌండర్‌ ఎలన్‌ మస్క్‌ సోషల్‌మీడియా వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌  ట్విటర్‌లో ఎలన్‌ మస్క్‌ షేర్లను కొన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో ట్విటర్‌ షేర్లు రయ్‌మంటూ దూసుకెళ్లాయి. 

ట్విటర్‌లో 9.2 శాతం వాటాల కొనుగోలు..!
ఎలన్ మస్క్ ట్విటర్‌లో 9.2 శాతం వాటాలను కొన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 10, 2022 నాటికి ట్విటర్‌లో9.2 శాతం వాటాను ఎలన్ మస్క్ కలిగి ఉన్నారని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో వెల్లడైంది. ఎలన్‌ మస్క్ తమ కంపెనీలో 73,486,938 షేర్లను కొనుగోలు చేశారని ట్విటర్ ఇంక్ కూడా తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ షేర్లు విలువ శుక్రవారం క్లోజింగ్ ధర 2.9 బిలియన్ డాలర్లుగా ఉంది.ట్విటర్‌లో ఎలన్‌ మస్క్‌ వాటాలను కల్గి ఉన్నారనే  వార్తల నేపథ్యంలో.. ట్విటర్ ఇంక్ షేర్లు 25.8 శాతం పైకి ఎగిశాయి. దీంతో ట్విటర్ ఇంక్ షేరు వాల్యు 49.48 డాలర్లకు చేరింది. ఈ వాటాల కొనుగోలుతో ట్విటర్‌లో అతిపెద్ద షేర్ హోల్డర్‌గా ఎలన్ మస్క్ నిలిచారు.

ఆశ్చర్యపోయినా నెటిజన్లు..!
కొద్ది రోజుల క్రితం ట్విటర్‌ వాక్‌ స్వాతంత్రపు విధానాలకు కట్టుబడి ఉండటం లేదంటూ ఏకంగా ట్విటర్‌లోనే పోల్‌ నిర్వహించాడు మస్క్‌. ట్విటర్‌ విధానాలపై మస్క్‌ ప్రశ్నించాడు. ట్విటర్‌కు బదులుగా మరో సోషల్‌మీడియా సైట్‌ను మస్క్‌ క్రియేట్‌ చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. కాగా ట్విటర్‌లో మస్క్‌ వాటాలను దక్కించుకోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. 

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు