ఎలాన్‌ మస్క్‌ అనాలోచిత నిర్ణయం, ట్విటర్‌ బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ నిలిపివేత!

12 Nov, 2022 12:05 IST|Sakshi

ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ బ్లూటిక్‌ పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ విషయంలో వెనక్కి తగ్గారు. పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కొనుగోలు అనంతరం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు సంస్థను మరిన్ని ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. ఇప్పటికే ఖర్చు తగ్గించేందుకు ఉద్యోగుల్ని తొలగించిన మస్క్‌ నాలుక్కరుచుకున్నారు. పింక్‌ స్లిప్‌ జారీ చేసిన ఉద్యోగుల్లో కొంతమంది తిరిగి కార్యాలయాలకు తిరిగి రావాలని కోరారు. 

తాజాగా బ్లూటిక్‌ వెరిఫికేషన్‌లో అదే తరహా నిర్ణయం తీసుకొని ఇబ్బందులు పడుతున్నారు. నెలకు 8 డాలర్లు చెల్లిస్తే ఎవరికైనా బ్లూట్‌ టిక్‌ వెరిఫికేషన్‌ను బ్యాడ్జీని అందిస్తామని కొద్ది రోజుల క్రితం ఎలాన్‌ మస్క్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజా నిర్ణయంతో ఒరిజనల్‌ సంస్థలు, వ్యక్తుల పేర్లమీద కొంతమంది ఫేక్‌ అకౌంట్‌లు క్రియేట్‌ చేస్తున్నారని, వాటి వల్ల ఏ అకౌంట్‌ ఒరిజినల్‌, ఏ అకౌంట్‌ డూప్లికేట్‌ అనేది గుర్తించడం కష్టంగా మారింది. అందుకే పెయిడ్‌ సబ్‌ సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా, దివాలా తీసేందుకు దగ్గరగా ఉన్న ట్విటర్‌ను.. మస్క్‌ తన నిర్ణయాలతో ఇంక ఎన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తారేమోనని షేర్‌ హోల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు