స్వదేశీ ట్విటర్ "కూ" యాప్ లో భారీగా పెట్టుబడులు

26 May, 2021 18:20 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రానికి, ట్విటర్ కి మధ్య టూల్ కిట్ విషయంలో ఘర్షణ జరుగుతున్న ఈ కీలక సమయంలో దేశీయ మైక్రో బ్లాగింగ్ "కూ" యాప్ సిరీస్ బి నిధుల కింద 30 మిలియన్లను సేకరించింది. అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్ పెట్టుబడి నిదుల కోసం ఈ రౌండ్ కి నాయకత్వం వహించింది. ప్రస్తుత పెట్టుబడిదారులు అక్సెల్ పార్టనర్స్, కలారి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్ మరియు డ్రీమ్ ఇంక్యుబేటర్ కూడా ఈ రౌండ్ లో పాల్గొన్నారు. దీంతో "కూ" యాప్ విలువ దాదాపు ఐదు రెట్లు పెరిగి 100 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐఐఎఫ్ఎల్, మిరే ఎస్టేట్స్ ఈ రౌండ్‌తో క్యాప్ టేబుల్‌ పైకి వచ్చిన ఇతర కొత్త పెట్టుబడిదారులు. 

"కూ" యాప్ అనేది భారతీయ భాషలలో అభిప్రాయాలు పంచుకునేందుకు ఉన్న ఒక మైక్రోబ్లాగింగ్ సైట్. ఇది కేవలం ఒక సంవత్సర కాలంలో దాదాపు 6 మిలియన్ల డౌన్లోడ్లను సంపాదించి ప్రతిరోజూ కమ్యూనిటీ పోస్ట్ చేసే కంటెంట్ తో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్ మరియు స్మృతి ఇరానీ వంటి అనేక మంది ప్రముఖులు ఇందులో ఉన్నారు.

"కూ"ని టాక్సీ ఫర్ స్యూర్ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ, గతంలో మీడియా యాంట్ & గుడ్ బాక్స్ వంటి సంస్థలను స్థాపించిన మయాంక్ బిదావత్కా కలిసి స్థాపించారు. కూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ.. “ రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా ఎదగడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయి. ప్రతి భారతీయుడు దగ్గరికి చేరుకోవాలని ఉత్సాహంగా ఉన్నామని. ఈ కలను సాకారం చేసుకోవడానికి టైగర్ గ్లోబల్ సరైన భాగస్వామి” అని అన్నారు.

చదవండి: బంగారం ప్రియులకు భారీ షాక్

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు