Paytm IPO: పేటీఎం ఢమాల్‌..! రూ.38 వేల కోట్ల లాస్‌ అతడి వాళ్లే..! నెటిజన్ల ఫైర్‌..!

24 Nov, 2021 10:03 IST|Sakshi

ఎన్నో ఆశల మధ్య భారత్‌లోనే అతి పెద్ద ఐపీవోగా వచ్చిన పేటీఎంకు మార్కెట్లలో చుక్కెదురైంది. గణనీయమైన నష్టాలను పేటీఎం చవిచూసింది.  పేటీఎం ఐపీవో ధర రూ. 2,150 ప్రారంభం కాగా....సుమారు పేటీఎం షేర్లు సుమారు 27 శాతం రూ. 585కు పడిపోయి చివరికి షేర్‌ విలువ రూ.1564 కు చేరుకుంది. ఇన్వెస్టర్లు సుమారు రూ. 38 వేల కోట్ల మేర నష్టపోయినట్లుగా తెలుస్తోంది. సోమవారం రోజున మరోసారి కంపెనీ షేర్లు మరోసారి 10.35 శాతం మేర క్షీణించి రూ. 1402కు చేరుకుంది. 
చదవండి: పేటీఎంలో లావాదేవీలు రెట్టింపు

 మీరే కారణం..మీరే బాధ్యత వహించాలి..!
పేటీఎం ఐపీవో అట్టర్‌ఫ్లాప్‌ కావడంతో తాజాగా  ట్విటర్‌లో నెటిజన్లు ఒక వ్యక్తిపై విరుచుకుపడుతున్నారు. పేటీఎం  ఒక్కో షేర్‌ ధరను తప్పుడు ప్రైజింగ్‌ ఇష్యూ  చేసినందుకు మీరే బాధ్యత వహించాలని హర్షద్‌ షా అనే నెటిజన్‌ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సీఈవో, ఎండీ ఉదయ్‌ కోటక్‌ను ట్విటర్‌లో ట్యాగ్‌ చేశారు. సుమారు రూ. 38 వేల కోట్లకు పైగా నష్టపోయినా ఇన్వెస్టర్లకు మీరే పరిహారం చెల్లించాలని కోరారు. దీంతో నెటి​జన్లు ఉదయ్‌ కోటక్‌ను నిందిస్తూనే...ఈ గందరగోళానికి కోటక్‌ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. 

స్పందించిన ఉదయ్‌ కోటక్‌..!
పేటీఎం ఐపీవో అట్టర్‌ఫ్లాప్‌ కావడం ఉదయ్‌ కోటక్‌ అనే భావనతో ట్విటర్‌లో నెటిజన్లు అతడిపై విరుచుకుపడుతున్నారు. కాగా ఈ విషయంపై ఉదయ్‌ కోటక్‌ ట్విటర్‌లో స్పందించారు. ఉదయ్‌ కోటక్‌ తన ట్విట్‌లో...మిస్టర్ షా దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. పేటీఎం ఇష్యూ ధరను కోటక్‌ నిర్థారించలేదంటూ అన్నారు. అంతేకాకుండా  ఇటీవలి కాలంలో ఐపీవోకు వచ్చిన జోమాటో, నైకా కంపెనీలకు కోటక్ మహీంద్రా బ్యాంక్ లీడ్ మేనేజర్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు.


ఉదయ్‌ కోటక్‌

జొమాటో షేర్‌ ఇష్యూ ధర రూ. 76గా నిర్ణయించగా ఇప్పుడు అది రూ. 150 ఉందని, నైకా షేర్‌ ఇష్యూ ధరను రూ.1125ను నిర్ణయించగా అది రూ.2100 చేరిందని ఉదయ్‌ కోటక్‌ బదులిచ్చారు. ఈ విషయంలో ఉదయ్‌ కోటక్‌కు హర్షద్‌ షా వారిని క్షమాపణలను కోరారు. 


చదవండి: పేటీఎం అట్టర్‌ ప్లాప్‌షో.. 63 వేల కోట్లు మటాష్‌! ఇన్వెస్టర్లు లబోదిబో

మరిన్ని వార్తలు