ట్విటర్-మస్క్‌ వార్‌: మనీ, టైం, ఎనర్జీ అన్నీ పాయే!

14 Jul, 2022 16:24 IST|Sakshi

సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ డీల్‌ వార్‌పై పారిశ్రామిక వేత్త  ఆనంద్స్పం‌ మహీంద్ర స్పందించారు. ట్విటర్‌ కొనుగోలు డీల్‌ నిలిచిపోవడంతో రెండు దిగ్గజాల మధ్య  పోరు  గ్లోబల్‌గా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మహీంద్రా గ్రూప్ బాస్ ఆనంద్ మహీంద్రా  ట్విటర్‌లో స్పందించారు. ఎంత వేస్ట్‌  ఆఫ్‌ టైం మనీ, అండ్‌ మనీ అంటూ కామెంట్‌ చేశారు. 

అసాధారణమైన వార్తలకు, అనుసంధానానికి మూలం ట్విటర్‌. అలాంటి ముఖ్య సంస్థను ఒ‍క పాక్షిక సామాజికసంస్థలా, లిస్టెడ్‌ కంపెనీలా, లాభాల కోసం.. ఏదైనాగానీ, ట్రస్టీల్లాగా బాధ్యతాయుతంగా ప్రవర్తించే డైరెక్టర్ల బోర్డుతో నిర్వహించుకోవచ్చుగా  అంటూ ట్వీట్‌  చేశారు. 

కాగా  44 బిలియన్ల డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తొలుత టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఆ తరువాత ట్విటర్‌లో నకిలీ ఖాతాలపై సరియైన సమాచారం ఇవ్వడం లేదంటూ డీల్‌కు  తాత్కాలిక బ్రేక్‌లేశారు. చివరికి  ట్విటర్‌ వైఫల్యం కారణంగానే డీల్‌ను రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. దీంతో మస్క్‌ నిర్ణయంపై ట్విటర్‌ న్యాయపోరాటానికి దిగింది. డెలావేర్ కాంట్రాక్ట్ చట్టానికి లోబడి విలీనాన్ని పూర్తి  చేయాలని  మస్క్‌ను ఆదేశించాలని కోరుతూ ట్విటర్‌ డెలావేర్  కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు