ట్విటర్ కొత్త ఫీచర్ తో అసత్య ప్రచారానికి చెక్ పెట్టండి

25 Nov, 2020 13:10 IST|Sakshi

సోషల్ మీడియా ద్వారా మనకు ఎంతో ముఖ్యమైన సమాచారం కూడా క్షణాలలో తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో వచ్చే ఈ సమాచారం ద్వారా మనకు జరిగే మేలు ఎంతో, అంతే మొత్తంలో నష్టం కూడా జరుగుతుది. అందుకోసమే, సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఆయా కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీని కోసం ఫేస్‌బుక్‌ వార్నింగ్ లేబుల్ తీసుకొస్తుంటే.. ట్విటర్ కూడా ఇదే తరహాలో డిస్‌ప్యూటెడ్ ట్వీట్‌(వివాదాస్పదమైన ట్వీట్) పేరుతో ఒక హెచ్చరికను జారీ చేస్తుంది. దీని ద్వారా మనం ఎక్కువ శాతం అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. కానీ వీటి గురుంచి చాలా మందికి తెలియక పోవడం వల్ల వాటిని తిరిగి పోస్ట్ చేయడం లేదా రీట్వీట్ చేస్తుంటారు. ఇది సోషల్ మీడియా కంపెనీలకు తల నొప్పిగా మారింది. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ట్విటర్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. (చదవండి: 43 యాప్స్‌ బ్యాన్‌ పై చైనా అభ్యంతరం)

ఇక నుండి ట్విట్టర్ వినియోగదారుడు డిస్‌ప్యూటెడ్ ట్వీట్ లేదా హెచ్చరికలు జారీ చేసిన ట్వీట్‌ను లైక్‌, షేర్ లేదా కామెంట్ చేయడానికి ట్విట్టర్ ఒక పాప్‌-అప్‌ విండోతో హెచ్చరిస్తోంది. అందులో ‘‘ఇది డిస్‌ప్యూటెడ్‌ ట్వీట్. నమ్మకమైన సమాచారం అందించే వేదికగా ట్విటర్‌ని ఉంచేందుకు సహాయపడండి. రీట్వీట్ చేసేముందు దాని గురించి మరింత సమాచారం తెలుసుకోండి’’ అని సందేశం కనిపిస్తుంది. ఈ ఫీచర్ పరీక్షల్లో భాగంగా ఇది సత్ఫలితాలనిచ్చిందని, దీని వల్ల 29 శాతం మేర అసత్య వార్తల ప్రచారం తగ్గిందని ట్విటర్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారిపై జరిగే తప్పుడు సమాచార వ్యాప్తికి ఇది కొంత వరకు అడ్డుకట్ట వేస్తుందని ట్విటర్ అభిప్రాయపడింది. 

మరిన్ని వార్తలు