మేము ట్విటర్‌లా ఫీజుల వసూలు చేయం.. ఇటు వచ్చేయండి!

1 Nov, 2022 18:54 IST|Sakshi

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఏం చేసినా అది వైరల్‌గా మారుతుంది. ఆయన చేసే ప్రతీ పనిలో తన ట్రేడ్‌మార్క్‌ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఒక్కోసారి అవి విమర్శలకు కూడా దారి తీస్తుంటాయి. తాజాగా ట్విటర్‌ టేకోవర్‌ తర్వాత ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు మస్క్‌. ట్విటర్‌లోని బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నారు. దీంతో అది నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తాజాగా దీనిపై కూ(koo) సీఈవో, సహవ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ  స్పందించారు.

ఇటు వచ్చేయండి!
ట్విట్టర్‌కు పోటీగా ఉన్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ (Koo) యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెట్టింట బ్లూ టిక్‌ వివాదం నడుస్తున్న నేపథ్యంలో కూ సంస్థ సీఈఓ రాధాకృష్ణ దీనిపై ట్వీట్‌ చేశారు. అందులో తాము ట్విటర్‌లా కాదని తెలుపుతూ.. ‘వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం ‘కూ’ నెలకు రూ. 1,600 వసూలు చేయదని #switchtokoo" అని ట్వీట్ చేశారు. మరి ఈ ట్విట్‌ యూజర్లను ఆకర్షిస్తుందా లేదా వేచి చూడాల్సిందే.

ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు టేకోవర్‌ చేసిన ఎలాన్‌ మస్క్‌ అనూహ్య మార్పులతో దూసుకుపోతున్నారు. ట్విటర్‌ తన సొంతమైన వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెద్ సెగాల్, పాలసీ చీఫ్ విజయ గద్దె లాంటి కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన సంగతి తెలిసిందే. ఇక భవిష్యత్తులో మరెన్ని మార్పులు వస్తాయో చూడాలి.

చదవండి: ట్విటర్‌ యూజర్లకు షాక్‌: భారీ వడ్డన దిశగా మస్క్‌ ప్లాన్లు

మరిన్ని వార్తలు